– దుబాయ్ ఛాంపియన్‌షిప్స్
దుబాయ్: భారత నంబర్‌వన్ టెన్నిస్ ఆటగాడు సుమిత్ నాగల్‌కు దుబారు ఛాంపియన్‌షిప్‌లో వైల్డ్‌కార్డ్ ఎంట్రీ లభించింది. సోమవారం నుంచి జరగనున్న ఏటిపి-500 దుబాయ్ ఛాంపియన్‌షిప్‌లో సుమిత్ తొలి రౌండ్‌లో 49వ ర్యాంకర్ ఇటలీకి చెందిన లోరెంజో సొనేగోతో తలపడనున్నాడు. ఈ క్రమంలో సుమిత్ ప్రి క్వార్టర్స్‌లో టాప్‌సీడ్ మెద్వదేవ్‌తో తలపడాల్సి ఉంటుంది. 26ఏళ్ల సుమిత్ కెరీర్ బెస్ట్ 100వ ర్యాంక్‌లో నిలిచినా.. ప్రస్తుతం 101వ ర్యాంక్‌కు పడిపోయాడు. ఈ ఏడాది జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ మెయిన్‌కు అర్హత సాధించిన సుమిత్.. తొలిరౌండ్‌లో 31వ సీడ్ కజకిస్తాన్‌కు చెందిన అలెగ్జాండర్ బుబ్లిక్‌ను చిత్తుచేసి రెండోరౌండ్‌కు చేరిన సంగతి తెలిసిందే.