– ఇంటర్ బోర్డు హెచ్చరిక
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రభుత్వరంగ, ఎయిడెడ్, ప్రయివేటు జూనియర్ కాలేజీలకు ప్రస్తుత విద్యాసంవత్సరంలో ఈనెల 30 చివరి పనిదినమని ఇంటర్ బోర్డు కార్యదర్శి శృతి ఓజా తెలిపారు. ఈనెల 31 నుంచి మే 31 వరకు వేసవి సెలవులుంటాయని గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అన్ని కాలేజీల ప్రిన్సిపాళ్లు, యాజమాన్యాలు ఈ సెలవులను విద్యార్థులకు వర్తింపచేయాలని ఆదేశించారు. ఏమైనా నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యార్థులకు నిబంధనలకు విరు ద్ధంగా తరగతులను నిర్వహించొద్దని సూచించారు. ఇంటర్ బోర్డు షెడ్యూల్ ఇచ్చిన తర్వాతే ప్రవేశాలు చేపట్టాలని కోరారు. వచ్చే విద్యాసంవత్సరంలో జూనియర్ కాలేజీల్లో జూన్ ఒకటి నుంచి తరగతులు ప్రారంభమవుతాయి.