సమ సమాజ స్థాపన లక్ష్యంగా ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపిన మహనీయుడు సుందరయ్య

నవతెలంగాణ – కంటేశ్వర్
సమ సమాజ స్థాపన లక్ష్యంగా ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపిన మహనీయుడు సుందరయ్య అని సిపిఎం నాయకులు వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతల్లో ఒకరైన పుచ్చలపల్లి సుందరయ్య 39వ వర్ధంతి సందర్భంగా సిపిఎం పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ .రమేష్ బాబు మాట్లాడుతూ.. భారతదేశంలో ఉన్న భూస్వామ్య విధానాల మూలంగా ఫ్యూడల్ భావిజాలంతో ప్రజల పైన జరుగుతున్న దోపిడిని, వివక్షతను అంతమొందించడానికి, సమ సమాజ స్థాపన లక్ష్యంగా అందుకు వర్గ పోరాటాల ద్వారా మాత్రమే విప్లవం సాధించవచ్చు అనే లక్ష్యంతో కమ్యూనిస్టు పార్టీ నిర్మాణం ద్వారా మాత్రమే దోపిడికి వ్యతిరేకం గా పోరాటాలు నిర్వహించి దోపిడి రహిత సమాజం నిర్మించాలని భారత దేశంలో కమ్యూనిస్టు పార్టీ నిర్మాతల్లో ఒకరైన పుచ్చలపల్లి సుందరయ్య ధనిక కుటుంబంలో జన్మించినప్పటికీ సాధారణ ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని అగ్రభాగాన ఉండి నిర్వహించి దున్నే వాడికి భూమి కావాలని లక్షలాది ఎకరాల ప్రభుత్వ భూములను వద్ద ఉన్న భూములను పేదలకు పంచి స్వయానా తన ఆస్తులను కూడా పంచిన మహనీయుడని, సమాజమే తన కుటుంబం గా భావించి నిరంతరం ప్రజా సమస్యల పైన పరితపించిన వ్యక్తి అని కొనియాడారు. ప్రతిపక్ష పార్టీల నాయకుడిగా ఉన్నప్పటికీ ప్రజా సమస్యల పోరాటంలో అగ్రభాగాన ఉండి ఉద్యమాలు నిర్వహించి వ్యక్తి అని కొని ఆడారు కుల , మత, లింగ విభేదాలను వ్యతిరేకిస్తూ కష్టజీవులందరూ ఐక్యంగా తమ హక్కుల కోసం పోరాడాలని పరితపించిన వ్యక్తి అనే అన్నారు. నేటికీ సుందరయ్య అనేకమంది ప్రజాప్రతినిధులకు నేటి యువతరానికి ఆదర్శనీయంగా తీసుకోవలసిన అవసరం ఉందని వారన్నారు. కేవలం ప్రజా సమస్యల పైన పోరాటమే కాకుండా ప్రజలకు కావలసిన సేవా కార్యక్రమాలను కూడా నిర్వహించి ఆచరణలో నిరూపించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ది వెంకట్ రాములు, నూర్జహాన్, ఏం గోవర్ధన్, జిల్లా కమిటీ సభ్యులు సుజాత, అనిల్ మరియు నరసయ్య, దీపిక, గణేష్ తది తరులతోపాటు కార్యకర్తలు పాల్గొన్నారు.

Spread the love