మా తెలంగాణ పార్టీకి సుప్రీం చురకలు

న్యూఢిల్లీ : మా తెలంగాణ పార్టీకి సుప్రీం కోర్టు చురకలంటించింది. అనవసర పిటిషన్లతో కోర్టు సమయం వృథా చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా తెలంగాణ హైకోర్టులో తప్పుడు పిటిషన్‌ వేసినందుకు మా తెలంగాణ పార్టీకి ధర్మాసనం రూ.50 వేల జరిమానా విధించింది. హైకోర్టు తీర్పుపై సదరు పార్టీ సుప్రీంకోర్టు ను ఆశ్రయించింది. హైకోర్టు జరిమానాను మాఫీ చేయాలని కోరుతూ సర్వో న్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేసింది. మా తెలంగాణ పార్టీ పేదదని, హైకోర్టు విధించిన జరి మానా కట్టలేమని మా తెలంగా ణ పార్టీ తరపు న్యాయవాది కోర్టు ను కోరారు. దీనిపై విచారణ చేప ట్టిన సుప్రీంకోర్టు మా తెలంగాణ పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇష్టానుసారంగా పిటిషన్‌లు దాఖ లు చేస్తే పేద పార్టీ అంటారా? అని సీజేఐ జస్టిస్‌ చంద్రచూడ్‌, జస్టిస్‌ పిఎస్‌ నరసింహ ధర్మాసనం  ప్రశ్నించింది. పేద పార్టీ అంటూ న్యాయవాదిని తప్పుపట్టిం చినందుకు పెనాల్టీ కట్టాలని మా తెలంగాణ పార్టీని ఆదేశించింది.

Spread the love