Friday, May 1, 2026
E-PAPER
Homeజాతీయంలైంగికదాడికి గురైన బాలిక గర్భవిచ్ఛిత్తిపై సుప్రీం కీలకవ్యాఖ్యలు

లైంగికదాడికి గురైన బాలిక గర్భవిచ్ఛిత్తిపై సుప్రీం కీలకవ్యాఖ్యలు

- Advertisement -

కాలానికి అనుగుణంగా చట్టాలు ఉండాలని కేంద్రానికి సూచన
ఆ ఘటన వారిని జీవితాంతం వెంటాడుతుంది : సీజేఐ
బాధిత బాలిక, ఆమె తల్లిదండ్రులదే తుది నిర్ణయమని స్పష్టం

లైంగికదాడికి గురైన బాలిక గర్భవిచ్ఛిత్తిపై సుప్రీం కీలకవ్యాఖ్యలు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
లైంగికదాడి కారణంగా గర్భం దాల్చిన బాలికకు గర్భవిచ్ఛిత్తిపై ఎలాంటి పరిమితులు లేకుండా చట్ట సవరణ చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సర్వోన్నత్య న్యాయస్థానం సూచించింది. చట్ట పరమైన వ్యవస్థ కాలంతో పాటు మార్పు చెందాలనీ, బాధితుల గౌరవానికి ప్రాధాన్యత ఇవ్వాలని ధర్మాసనం స్పష్టం చేసింది. గర్భవతి అయిన బాధిత బాలిక విషయంలో ఎయిమ్స్‌ దాఖలు చేసిన క్యూరే టీవ్‌ పిటిషన్‌పై గురువారం సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ జయమాల్య బాగ్చీలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఎయిమ్స్‌ తరపున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ (ఏఎస్జీ) ఐశ్వర్యభాటి వాదనలు వినిపించారు. ప్రస్తుతం బాధిత బాలిక గర్భం కొనసాగించడం ఆమెతో పాటు పుట్టబోయే బిడ్డకు మంచిదని నివేదించారు. ఈ అభ్యర్థనపై అభ్యంతరాలను వ్యక్తం చేసిన ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆ బిడ్డపై నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానిది లేదా వైద్య సంస్థలది కాకుండా… బాధిత బాలిక, ఆమె తల్లిదండ్రులదై ఉండాలని వ్యాఖ్యానించింది. ‘దయచేసి మీ(కేంద్ర ప్రభుత్వాన్ని) చట్టాన్ని సవరించండీ. లైంగికదాడి కారణంగా గర్భం దాల్చినప్పుడు కాలపరిమితి ఉండకూడదు. మారుతున్న కాలానికి అనుగుణంగా చట్టం ఉండాలి’ అని పేర్కొంది.

ఆ ఘటన బాధితురాలికి మాయని మచ్చ:సీజేఐ
ఎయిమ్స్‌తో పాటు రాష్ట్ర ప్రభుత్వ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం పలు అంశాలను ప్రస్తావించింది. ‘ఇది బాలికపై లైంగికదాడి కేసు. ఇది బాధితురాలికి జీవితాంతం మచ్చ. మానసిక క్షోభ మిగులుస్తుంది. బాధితురాలు తల్లి కావాలి. కానీ ఆ బాధను అనుభవించిన తల్లిని కాకుండా బిడ్డ(కడుపులోని పిండం)పైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారు’ అని సీజేఐ వ్యాఖ్యానించారు. దీంతో ఆ బాలిక ఆరోగ్యంపై శాశ్వత ప్రభావం లేకపోతే గర్భవిచ్చిత్తిని నిర్వహించడం, ఆమె ఆరోగ్య సమస్యల విషయంలో నిపుణులతో బాధితురా లికి, ఆమె తల్లిదండ్రులకు కౌన్సిలింగ్‌ ఇవ్వాలని జస్టిస్‌ బాగ్చి వ్యాఖ్యానించారు. ఆ తర్వాత బాలిక, ఆమె తల్లి దండ్రులు తీసుకునే నిర్ణయాన్నే కోర్టు పరిగణనలోకి తీసుకుంటుందని స్పష్టం చేశారు.

గర్భాన్ని కొనసాగించడమే బిడ్డ శ్రేయస్సుకు మేలు : ఎయిమ్స్‌

లైంగికదాడి కారణంగా ఓ బాలిక గర్భం దాల్చగా ఆ కేసులో ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా గర్భాన్ని మోయమని బలవంతం చేయలేమని సుప్రీంకోర్టు ధర్మాసనం గత విచారణలో వ్యాఖ్యానించింది. 20 వారాల(ఏడు నెలల) గర్భాన్ని తొలగించుకోవడానికి కోర్టు అనుమతిచ్చింది. ఈ ఆదేశాలను పున: సమీక్షించాలని ఆల్‌ ఇండియా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) క్యూరేటీవ్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. ఏడు నెలల గర్భాన్ని తొలగిస్తే తీవ్రమైన వైకల్యాలతో శిశువు జన్మించే అవకాశం ఉందని అందులో ప్రస్తావించింది.

.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -