Monday, May 18, 2026
E-PAPER
Homeఆటలుఅండర్‌-23లో టీ20 టోర్నీ?

అండర్‌-23లో టీ20 టోర్నీ?

- Advertisement -

50 ఓవర్ల ఫార్మాట్‌‌కు మంగళంవచ్చే దేశవాళీ సీజన్‌‌కు బీసీసీఐ ఆలోచన

ముంబయి : ఆధునిక క్రికెట్‌‌లో టీ20 ఫార్మాట్‌ ‌వేగంగా అభివృద్ది చెందుతుండగా.. దేశవాళీ అండర్‌-23 సర్క్యూట్‌‌లో సైతం పొట్టి ఫార్మాట్‌ను ప్రవేశపెట్టేందుకు భారత క్రికెట్‌ ‌నియంత్రణ మండలి (బీసీసీఐ) సమాచాలోచనలు చేస్తోంది. అండర్‌-23లో ప్రస్తుతం వైట్‌‌బాల్‌‌లో 50 ఓవర్ల ఫార్మాట్‌‌ను ‘స్టేట్ ఏ చాంపియన్‌‌షిప్‌’గా, రెడ్‌‌బాల్‌‌ను కల్నల్‌ ‌సికె నాయుడు ట్రోఫీగా నిర్వహిస్తున్నారు. 50 ఓవర్ల ఫార్మాట్‌ ‌టోర్నీని టీ20 ఫార్మాట్‌‌కు మార్పు చేయటంపై రాష్ట్ర క్రికెట్‌ ‌సంఘాలు సహా ఇతర భాగస్వాముల అభిప్రాయాలను బీసీసీఐ కోరినట్టు తెలుస్తోంది. ‘స్టేట్‌ ఏ చాంపియన్‌‌షిప్‌ను టీ20 టోర్నీగా మార్చే ఆలోచన ఆరంభ దశలోనే ఉంది. రాష్ట్ర సంఘాలు, ఇతర భాగస్వాముల అభిప్రాయాలను బోర్డు తీసుకుంటోంది. అన్నీ కుదిరితే 2026-27 సీజన్‌ నుంచే టీ20 ఫార్మాట్‌ ‌టోర్నమెంట్‌‌ను మొదలుపెడతారు’ అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. స్టేట్‌ ఏ చాంపియన్‌‌షిప్‌ ‌టోర్నీలో ప్రస్తుతం ఎలైట్‌ ‌విభాగంలో తమిళనాడు, ప్లేట్‌ ‌గ్రూప్‌‌లో మేఘాలయ డిఫెండింగ్‌ ‌చాంపియన్లుగా ఉన్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -