బీఆర్‌ఎస్‌ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి

– ఆత్మ కమిటీ చైర్మెన్‌ భద్రయ్య
నవతెలంగాణ-పినపాక
బీఆర్‌ఎస్‌ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఆత్మ కమిటీ చైర్మన్‌ భద్రయ్య పిలుపునిచ్చారు. జానంపేట గ్రామపంచాయతీ నందు బూత్‌ నెంబర్‌ 51 సమన్వయ బత్తుల నంద ఆధ్వర్యంలో 51 బూత్‌ నంబర్‌ ఇంచార్జ్‌ బీయల మురళీ నియమించడం జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు ప్రభుత్వ విప్‌, పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు ఆదేశాల మేరకు సమావేశం ఏర్పాటు చేసినట్టు ఆత్మ కమిటీ చైర్మన్‌ పటేల్‌ భద్రయ్య నాయుడు తెలిపారు. అనంతరం జానంపేటలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆత్మ కమిటీ చైర్మన్‌ భద్రయ్య మాట్లాడుతూ భవిష్యత్తు కార్యచరణ గురించి తగు సూచనలు బూత్‌ కమిటీ వారికి ఇవ్వడం జరిగింది. అలాగే బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు గడపగడపకు చేరవేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్‌ డాక్టర్‌ రవి శేఖర్‌ వర్మ, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం డైరెక్టర్‌ పటేల్‌ కామేశ్వరరావు, ఎంపీటీసీ కాయం శేఖర్‌, అమరారం సర్పంచ్‌ మొగిలిపల్లి నరసింహారావు, బెడద శ్రీను, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.

Spread the love