భావిభారత నిర్మాతలు ఉపాధ్యాయులే..

– మండల పరిషత్ ఆధ్వర్యంలో సన్మానం..
నవతెలంగాణ – అశ్వారావుపేట
భావిభారత నిర్మాతలు ఉపాధ్యాయులే నని,రేపటి సమాజం తరగతి గదిలోనే రూపొందుతుందని ఎం.పి.పి శ్రీరామమూర్తి అన్నారు. భారత రాష్ట్రపతి సర్వేపల్లి రాధాక్రిష్ణ జయంతి సందర్భంగా నిర్వహించే గురుపూజోత్సవాన్ని మంగళవారం మండల పరిషత్ ఆధ్వర్యంలో ఎం.పి.పి శ్రీరామ మూర్తి నేతృత్వంలో 40 ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు.ఇందులో ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు,కళాశాల ల ప్రిన్సిపాల్ లు,ప్రైవేట్ స్కూల్ పాఠశాల యజమానులు ఉన్నారు.అలాగే ఆగస్ట్ 15 న జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా ఉత్తమ ఉద్యోగి అవార్డును అందుకున్న రోడ్లు భవనాలు శాఖ డీఈ  శ్రీనివాస్, అంగన్వాడీ టీచర్ సుజాత ను  సన్మానించారు. ఈ సందర్బంగా ఎంపీపీ మాట్లాడుతూ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు సూచన మేరకు గురువులను సన్మాన చేపట్టాం అని అన్నారు.తల్లిదండ్రుల తర్వాత గురువే ప్రతి ఒక్క మనిషికి బుద్ది జ్ఞానం మంచి చెడు అలవాట్లతో పాటు బ్రతకడానికి మార్గం చూపే వ్యక్తి గురువు అనీ,నా చిన్నతనంలో నా కుటుంబ పరిస్థితుల ప్రభావం వలన ఎక్కువ గా చదువుకో లేక పోయానని అప్పట్లో 10 వా తరగతి చదువుకుంటే చాలా ఎక్కువ చదివినట్టు అనీ,ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వసతులు ఏమి లేక చాలా ఇబ్బందులు పడ్డామని అయన తెలిపారు.అలాగే ప్రతి పాఠశాలలో, గురుకులాల్లో చదివే విద్యార్థుల కొరకు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అన్ని రకాల వసతులను ఏర్పాటు చేశారని,రానున్న రోజులలో మరిన్ని వసతులను తీసుకొస్తారనీ అయన తెలిపారు.అలాగే మండలంలోని ఏ పాఠశాలలోనైన సరే ఎవరికి ఏ ఇబ్బందీ వచ్చిన సరే వెంటనే తెలియజేయమని,నా దృష్టికి వస్తే తక్షణమే స్పందిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఉపాధ్యాయులు మాట్లాడుతూ మా సేవలను గుర్తించి మాకు ఈ గురుపూజోత్సవం సందర్బంగా సన్మానించడం చాలా సంతోషంగా ఉందని,ఎంపీపీ శ్రీరామ మూర్తి ఎదైనా సమస్య ఉందని తెలిపితే వెంటనే స్పందిస్తారని, విద్యార్ధుల పట్ల ఉన్న ప్రేమ అలాగే ఉపాధ్యాయుల పట్లా ఉన్న గౌరవంతో తన సొంత ఖర్చుతో మమ్మలని ఇలా సన్మానించడం చాలా సంతోషంగా ఉందని వారు తెలిపారు.  ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ చిట్టూరి ఫణీంద్ర,ఎం.పి.డి.ఒ శ్రీనివాస్,తహశీల్ధార్ క్రిష్ణ ప్రసాద్, ఎం.ఇ.ఒ క్రిష్ణయ్య,ఎం.పి.ఇ.ఒ సీతారామరాజు, బీఆర్ఎస్ మండల అద్యక్షులు బండి పుల్లారావు,నాయకులు మందపాటి రాజ మోహన్ రెడ్డి, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి యుఎస్ ప్రకాష్ రావు,టౌన్ ప్రెసిడెంట్ సత్యవరపు‌ సంపూర్ణ,కొణిజర్ల ఉమా మహేశ్వర రావు ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love