డ్వాక్రా మహిళలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్

నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణలో డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్ చెప్తూ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. స్వయం సహాయక సంఘాల మహిళలకు మండల, జిల్లా కేంద్రాల్లో ఉచిత కుట్టు శిక్షణ ఇప్పించనుంది. వారికి విద్యార్థులు, పోలీసుల యూనిఫామ్ కుట్టు పనులను అప్పగించాలని, దీనిపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని పంచాయతీరాజ్ శాఖను ఆదేశించింది. అలాగే రూ.500కే వంటగ్యాస్ సిలిండర్ పథకం అమలులో మహిళా సంఘాలకు భాగస్వామ్యం కల్పించాలని భావిస్తోంది.

Spread the love