అక్రమ అరెస్టులకు ఖండన : తెలంగాణ క్రాంతిదల్‌

ధరూర్‌ : నడిగడ్డ హక్కుల పోరాట సమితి చైర్మన్‌ గొంగళ్ల రంజిత్‌ కుమార్‌పై పెట్టిన అక్రమ అరెస్టులను తెలంగాణ క్రాంతి దళ్‌ రాష్ట్ర నాయకులు నాగేష్‌ యాదవ్‌ తీవ్రంగా ఖండించారు. ఆదివారం తెలంగాణ క్రాంతి దళ్‌ రాష్ట్ర నాయకులు నాగేష్‌ యాదవ్‌ మాట్లాడుతూ గత నాలుగు రోజుల కింద గద్వాల్‌ నియోజక వర్గంలో ఒక చిన్న సమస్యను పెద్దదిగా చూయించి బహుజన గొంతుక తెలంగాణ ఉద్యమకారుడిగా, జిల్లా ఉద్యమ నాయకుడిగా, అనేక సామాజిక పోరాటాల్లో పాల్గొ ంటూ .. సీడ్‌ పత్తి ఆర్గనైజర్లు చేస్తున్నటువంటి అన్యాలను అక్రమాలను ఎండగడుతూ వారికి న్యాయం జరిగేలా పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి నడిగడ్డ హక్కుల పో రాట సమితి కార్యాలయంపై దాడి, ఆయనతో పాటు అనుచరుల వాహనాలను ధ్వంసం చేయడం సరైందికాదన్నారు. గొంగళ్లను రాజకీయంగా ఎదుర్కొనే శక్తిలేకపే ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి మనుషులు ఇక్కడి పోలీసు వారు ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఇరువర్గాలు కేసులు పెట్టినప్పటికీ కనీసం విచారణ చేయకుండా రంజిత్‌ కుమార్‌పై ఆయన అనుచరుల మీదనే అనేకమైన సెక్షన్లు పెట్టి కేసులు నమోదు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తెలంగాణ క్రాంతి దళ్‌ దీన్ని తీవ్రంగా ఖండిస్తుందన్నారు. పోలీసు వారు టీిఆర్‌ఎస్‌ మనుషులుగా వ్యవహరించకుండా కృష్ణమోహన్‌ రెడ్డి అనుచరుల మీద కూడా కేసు నమోదు చేయాలని దీనికి ప్రోత్సహించినటువంటి కృష్ణమోహన్‌ రెడ్డిని కూడా ప్రతి వాదిగా చేర్చి ఆయనపై కూడా కేసు నమోదు చేసి సామా న్యులకు నమ్మకం కలిగించేలా పోలీస్‌ వ్యవస్థ ఉండాలని కోరారు. లేనిపక్షంలో తెలంగాణ క్రాంతి దళ్‌ రాష్ట్ర కమిటీ భవిష్యత్‌ కార్యాచరణ చేపట్టి నిరసన, ధర్నాలు చేయనున్నట్లు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ క్రాంతి దళ్‌ రాష్ట్ర నాయకులు గౌనింటి వీరేష్‌, రాముడు,రాంరెడ్డి వినోద్చారి ఈశ్వర్‌, గోవిందు యాదవ్‌, రామంజి, శివన్న తదితరులు పాల్గొన్నారు.

Spread the love