తెలంగాణ ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ జన్మదిన వేడుకలు..

నవతెలంగాణ -శంకరపట్నం
తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ జన్మదిన వేడుకలను శనివారం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శంకరపట్నం మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గంటా మైపాల్ జెడ్పిటిసి లింగంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి లింగంపల్లి శ్రీనివాస్ రెడ్డి, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు పల్లె సంజీవరెడ్డి, చౌడమల్ల వీరస్వామి,మెట్ పల్లి సింగిల్ విండో చైర్మన్ పొద్దుటూరి సంజీవరెడ్డి, సాగి మలహల్రావు సర్పంచులు భద్రయ్య, కిషన్ రావు,రంజిత్ రావు,సంపత్, మహేష్,సంపత్, ఉప సర్పంచుల పోరం అధ్యక్షుడు గజ్జెల్లి హనుమంతు, ఎంపీటీసీలు గాండ్ల తిరుపతి, శ్యామ్ రావు, మాతంగి లక్ష్మయ్య, కల్లూరి పోచయ్య, వివిధ గ్రామాల గ్రామ శాఖ అధ్యక్షులు, టిఆర్ఎస్ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Spread the love