తెలంగాణ ఎస్సీ గురుకులాల్లో ఇంటర్‌ ప్రవేశాలు

నవతెలంగాణ – హైదరాబాద్
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ(టీఎస్డబ్ల్యూఆర్‌ఈఐఎస్‌)- రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జనరల్‌ & ఒకేషనల్‌ నాన్‌ సీఓఈ ఇంటర్‌ కళాశాలల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ, హెచ్‌ఈసీ, ఒకేషనల్‌ గ్రూప్‌లలో మిగిలిన సీట్లు భర్తీ చేయనున్నారు. అకడమిక్‌ మెరిట్‌ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
అర్హత: అభ్యర్థులు రెగ్యులర్‌ విధానంలో పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి. తెలుగు మీడియం అభ్యర్థులు కూడా అర్హులే. విద్యార్థుల వయసు ఆగస్టు 31 నాటికి 17 ఏళ్లు మించకూడదు. కుటుంబ వార్షికాదాయం గ్రామాల్లో రూ.1,50,000; పట్టణాల్లో రూ.2,00,000 మించకూడదు.
దరఖాస్తు ఫీజు: రూ.100
దరఖాస్తుకు చివరి తేదీ: జూన్‌ 15
వెబ్‌సైట్‌: www.tswreis.ac.in

Spread the love