తెలుగోడి ఆత్మగౌరవం..జోహార్‌ ఎన్టీఆర్‌..విశ్వక్‌ సేన్ ఊరమాస్ లుక్‌

నవతెలంగాణ-హైదరాబాద్ : విశ్వక్‌సేన్ నటిస్తున్న తాజా చిత్రం విశ్వక్‌ సేన్‌ 11 (VS 11). ఛల్ మోహన్ రంగ ఫేం కృష్ణ చైతన్య డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ నుంచి అదిరిపోయే అప్‌డేట్ అందించారు మేకర్స్‌. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, నటరత్న నందమూరి తారక రామారావు శతజయంతి సందర్భంగా ఆయన సేవలను గుర్తు చేస్తూ.. తెలుగోడి ఆత్మగౌరవం.. జోహార్‌ ఎన్టీఆర్‌ అంటూ VS 11 లుక్‌ను లాంఛ్ చేశారు. విశ్వక్‌సేన్‌ గడ్డంతో ఊరమాస్‌ లుక్‌లో కనిపిస్తున్న ఈ లుక్‌ ఇప్పుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. శ్రీకర స్టూడియోస్‌ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి ఫార్చ్యూన్ ఫోర్‌ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నేహా శెట్టి, అంజలి ఫీ మేల్ లీడ్‌ రోల్స్‌ లో నటిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు.

Spread the love