Sunday, August 23, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆలయాలు ప్రశాంతతకు నిలయాలు 

ఆలయాలు ప్రశాంతతకు నిలయాలు 

- Advertisement -

రామన్నగూడెం ముత్యాలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు 
కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు భూక్య ఉమా మురళి నాయక్ 
నవతెలంగాణ-నెల్లికుదురు 

ఆలయాలు మనసుకు ప్రశాంతత నిలయాలని కాంగ్రెస్ పార్టీ మహబూబాద్ జిల్లా అధ్యక్షురాలు భూక్య ఉమా మురళి నాయక్‌ అన్నారు. ఆదివారం రామన్నగూడెం గ్రామంలో నూతన ముత్యాలమ్మ ఆలయంలో ఆ పార్టీ మండల అధ్యక్షుడు ఎదెళ్ళ యాదవ రెడ్డి మాజీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నాయని సత్యపాల్ రెడ్డితో కలిసి ప్రత్యేక పూజలు ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామంలో గ్రామ దేవతలను కొలుచుకోవడం మంచిదని, దీంతో ప్రజల్లో ప్రశాంతత నెలకొంటుందని అన్నారు.

ఆ గ్రామ సర్పంచ్ బండి శ్రీను గ్రామ నాయకులు ఆకుతోట సతీష్ రావుల సతీష్ ముఖ్యఅతిథిగా వచ్చిన జిల్లా అధ్యక్షురాలికి ఉమాకి వివిధ గ్రామాల సర్పంచులకు శాలవాతో ఘనంగా సత్కరించే కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఆ పార్టీ సీనియర్ నేత స్వర్గీయకాసం లక్ష్మారెడ్డి కుటుంబానికి సందర్శించి కుటుంబ సభ్యులను పరమార్శించి, మనోధైర్యం నింపారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షుడు ప్రభాకర్ గౌడ్ నాయకులు గుగులోతు బాలాజీ నాయక్ చీకటి వీరన్న ,జగదీష్, పాశం రమేష్, మద్ది రాజేష్, క్రాంతి రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు ఉప సర్పంచ్లు జిల్లా మండల గ్రామ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -