– మత ప్రదర్శనపై రాళ్ళు, కార్లకు నిప్పు ఇద్దరు హౌంగార్డుల మృతి
గురుగావ్ : హర్యానాలోని నుహలో ఒక మత ప్రదర్శన సందర్భంగా రాళ్లు విసరడం, కార్లకు నిప్పంటించడం వంటి సంఘటనలు చోటు చేసుకున్నాయని పోలీసులు తెలిపారు. జనాలను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయు గోళాలను ప్రయోగించారు. దీంత ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఒక్కచోట గుమిగూడకుండా నిషేధాజ్ఞలు విధించారు. బుధవారం వరకు మొబైల్ ఇంటర్‌నెట్ సేవలు నిలిపివేయబడ్డాయి. మతోన్మాద ఉద్రికత్తలు మరింత పెచ్చరిల్లకుండా వుండేందుకే ఈ చర్య తీసుకున్నట్లు హర్యానా ప్రభుత్వం తెలిపింది. పొరుగున గల జిల్లాల నుండి అదనపు బలగాలను తరలిస్తున్నట్లు హర్యానా హోం మంత్రి అనీల్ విజ్ తెలిపారు. హెలికాప్టర్ ద్వారా కూడా బలగాలను పంపేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. నుV్‌ాలోని ఖెడ్లా మోడ్‌కి సమీపంలో వీహెచ్‌పీ చేపట్టిన బ్రిజ్ మండల్ జలాభిషేక్ యాత్రను కొంతమంది వ్యక్తులు నిలువరించారు. ప్రదర్శనపై రాళ్ళు విసిరారు, ప్రదర్శనలో పాల్గొన్న వాటిలో నాలుగు కార్లకు నిప్పంటించారని పోలీసులు తెలిపారు. కొన్ని పోలీసు వాహనాలు కూడా దెబ్బతిన్నాయి. దీంతో ప్రదర్శనలో పాల్గొన్న వారు ఆ వ్యక్తులపైకి రాళ్లు విసిరారు. కొంతమంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు.కాగా ఇద్దరు హౌం గార్డులు మృతి చెందారు. గురుగావ్‌లోని సివిల్ లైన్స్ నుంచి తొలుత ఈ యాత్రను బీజేపీ జిల్లా అధ్యక్షుడు గార్గి కక్కర్ ఆరంభించారు. ప్రదర్శనతోపాటూ పోలీసు కాన్వారు కూడా సాగుతోంది. బల్లాబఘర్‌లో బజరంగ్ దళ్ కార్యకర్త ఒకరు సోషల్‌మీడియాలో అభ్యంతరకరమైన రీతిలో వీడియోను పోస్ట్ చేయడంతోనే ఘర్షణ మొదలైందని కొన్ని వార్తలు వెలువడ్డాయి. తక్షణమే పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికే తమ ప్రాధాన్యత అని హోం మంత్రి విజ్ తెలిపారు. శాంతియుతంగా వుండాల్సిందిగా ఆయన ప్రజలను కోరారు. డిజిపి, అదనపు చీఫ్ సెక్రెటరీ, ఇతర సీనియర్ అధికారులతో మాట్లాడుతున్నట్లు చెప్పారు.