విశ్వవ్యాప్తమైన మహంకాళి బోనాల జాతర: మంత్రి తలసాని

minister-talasani-srinivas-yadavనవతెలంగాణ – హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతే బోనాలు పండుగ ఘనంగా జరుగుతున్నదని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. బోనాలు మన సంస్కృతికి ప్రతీకగా నిలలుస్తాయని తెలిపారు. 2014 నుంచి బోనాల ఉత్సవాలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నదని చెప్పారు. బోనాలను సీఎం కేసీఆర్‌ రాష్ట్ర పండుగగా ప్రకటించారన్నారు. ఆషాఢ బోనాల సందర్భంగా సికింద్రాబాద్‌లోని శ్రీ ఉజ్జయిని మహంకాలి అమ్మవారికి మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కుటుంబం తొలిబోనం సమర్పించింది. ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం మంత్రి తలసాని మీడియాతో మాట్లాడుతూ.. బోనాలను ఘనంగా నిర్వహించుకోవాలి అనే ఉద్దేశంతోనే ఆలయాలకు ప్రభుత్వం ఆర్ధిక సహాయం అందిస్తున్నదని చెప్పారు. ప్రైవేట్ దేవాలయాలకు కూడా ఆర్థికంగా సహాయం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. బోనాల సందర్భంగా వచ్చే లక్షలాది మంది భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.

Spread the love