బహ్రెయిన్ లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకలు…

నవతెలంగాణ వెబ్ డెస్క్:

బహ్రెయిన్ లో ఎన్నారై బీఆర్ఎస్‌ సెల్ ఆధ్వర్యంలో తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నారై బీఆర్ఎస్‌.సెల్ ఉపాధ్యక్షులు వెంకటేష్  బొలిశెట్టి  అధ్యక్షతన జరిగిన ఈ వేడుకల్లో రెండు నిమిషాలు మౌనం పాటించి అమరవీరులకు నివాళు అర్పించారు.  అనంతరం కేకును కట్ చేసి ఆనందోత్సాలతో తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా  ఎన్నారై బీఆర్ఎస్‌ సెల్ అధ్యక్షులు రాధారపు సతీష్ కుమార్, ఉపాధ్యక్షులు వెంకటేష్  బొలిశెట్టి మాట్లాడుతూ బహ్రెయిన్ లో తెలంగాణ రాష్ట్ర ఆవతరణ దినోత్సవాలు జరుపుకుంటున్నందుకు చాల సంతోషంగా వుంది అని , తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకోసం అసువులు బాసిన ఎందరో మహనీయుల త్యాగఫలం , కేసీఆర్  సారథ్యంతోనే  ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఏర్పడింది. స్వరాష్ట్రం సిద్ధించాక తొమ్మిదేండ్లలో అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ దేశంలోనే ముందంజలో ఉన్నదని, ఇదంతా సీఎం కేసీఆర్‌ వల్లే సాధ్యమైందని అన్నారు. తెలంగాణలో వెలుగు జిలుగుల‌తో తెలంగాణ విరాజిల్లుతోంది. ఇది తెలంగాణ పున‌ర్నిర్మాణం. నాడు పరాయి పాలనలో బీడు భూములు, ఎండిన చెరువులు, తాగు నీటి కష్టాలు, క‌రెంట్ షాక్‌ల‌తో రైతులు చ‌నిపోయారు. నేడు 24 గంట‌ల క‌రెంట్‌తో రైతులు కంటి నిండా నిద్ర పోతున్నారు. గ్రామాలు, పట్టణాలు అభివృద్ధి చెందుతున్నాయి. అనేక అవార్డులు సొంతం చేసుకుంటున్నాయి. తెలంగాణ వ‌చ్చిన నాటి నుంచి ఇప్పటి వ‌ర‌కు అభివృద్ధిలో దేశంలోనే నంబ‌ర్ వ‌న్ స్థాయిలో ముందున్నాం.

బీజేపీ పతనం
       దేశంలో బీజేపీ పతనం ప్రారంభమైందని స్పష్టం చేశారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయమే ఇందుకు నిదర్శనమని తేల్చిచెప్పారు. రానున్న రోజుల్లో దేశ ప్రజలు బీజేపీకి గుణపాఠం చెప్పేందుకు యావత్‌ భారతావని సన్నద్ధం అవుతున్నదని పేర్కొన్నారు. తెలంగాణలో సీఎం కేసీఆర్‌ అందిస్తున్న పథకాలు, చేస్తున్న అభివృద్ధిని దేశ ప్రజలు గమనిస్తున్నారని, వారు కూడా కేసీఆర్‌ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని తెలిపారు. తెలంగాణలో బీఆర్‌ఎస్‌ హ్యాట్రిక్‌ విజయం ఖాయమని, మూడోసారి కూడా కేసీఆరే ముఖ్యమంత్రి అవుతారని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వమే దేశానికి శ్రీరామ రక్ష అని ప్రధాన కార్యదర్శి  పుప్పాల బద్రి, మగ్గిడి రాజేందర్, అన్నారం  సుమన్ మాట్లాడుతూరైతులు, పేదలు రెండు కండ్లుగా పరిపాలన సాగిస్తూ.తెలంగాణ రాష్ర్టాన్ని సుభిక్షం చేశారని కొనియాడారుసీఎం కేసీఆర్‌ పాలనలో రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పారు. కేసీఆర్‌ దార్శనిక పాలన వల్ల రాష్ట్రం అన్ని రంగాల్లో నంబర్‌ వన్‌గా నిలిచిందని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ దార్శనిక మాడల్‌ను యావత్తు దేశం కోరుకుంటున్నదని చెప్పారు. కేసీఆర్‌ పాలన, పార్టీ విధానాలకు ఆకర్షితులై బీఆర్‌ఎస్‌లో పని చేయటానికి దేశ ప్రజలు ముందుకు వస్తున్నారు. ఈ కార్యక్రమములో ఎన్నారై బీఆర్ఎస్‌ సెల్  అధ్యక్షులు  రాధారపు  సతీష్ కుమార్, ఉపాధ్యక్షులు వెంకటేష్  బొలిశెట్టి,ప్రధాన కార్యదర్శి  పుప్పాల బద్రి, మగ్గిడి రాజేందర్, అన్నారం  సుమన్, కార్యదర్శులు, సంగేపోలు దేవన్న,  ఉత్కం  కిరణ్ గౌడ్, కొత్తూరు సాయన్న, బొలిశెట్టిప్రమోద్,చంద్రశేఖర్, కాసీం, రవి కుమార్, అన్నారం శ్రీ కుమార్, బీఆర్ఎస్‌ నాయుకులు పాల్గొన్నారు.
Spread the love