చాలా మంది గొప్ప గొప్ప నాయకులు కావాలని కలలుకంటుంటారు. వీరిలో కొందరు తమ కలలను సాకారం చేసుకునే దిశగా తమను తాము మలుచుకుంటారు. అయితే.. నాయకులు కావాలంటే ముందుగా మనలో నాయకత్వ లక్షణాలు ఉన్నాయో లేదో గుర్తించాలి. అలాగే మనలోని బలాలు బలహీనతలపై స్పష్టమైన అవగాహన కలిగి వుండాలి. అపుడే మనం ఓ మంచి లీడర్‌గా ఎదగలం. అసలు నాయకత్వ లక్షణాలు ఎలా ఉండాలో తెలుసుకుందాం.
ఎల్లవేళలా ఆశావాద దక్పథం కలిగి వుండాలి. తొలుత చిన్న లక్ష్యాలు, ఆ తర్వాత పెద్ద లక్ష్యాలను చేరుకునేలా సాధన వుండాలి.
బందంలోని సభ్యుల ప్రతిభను గుర్తించగలగాలి. వారికిచ్చిన పనులు సక్రమంగా పూర్తి చేస్తున్నారా లేదా అన్నది గ్రహించాలి. వారిని గౌరవిస్తూ వుండాలి. వారిలోని బలహీనతలు, బలాలను తెలుసుకుని మసలుకోవాలి.
నిర్ణయం తీసుకోవాల్సినపుడు తన నిర్ణయమే చివరిదై ఉండాలి. అప్పుడప్పుడూ బంద సభ్యుల సలహాలు తీసుకోవచ్చు. సజనాత్మకతను పెంచుకోవాలని టీం సభ్యులను పోత్సహిస్తూ ఉండాలి.
నాయకత్వంలో ఉన్నప్పుడు కొన్ని పనులు చేయకూడదు.
ఒకవేళ పనిలో ప్రతికూల వాతావరణం ఏర్పడితే బందసభ్యులను నిందించవద్దు. తప్పు ఎక్కడుందో తెలుసుకుని సరిదిద్దేందుకు ప్రయత్నించాలి.