ఆదిమరిస్తే అంతే 

That's it if you forget the beginning– విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ అంచున ప్రయాణం.
నవతెలంగాణ – నసురుల్లాబాద్ 
బీర్కూర్ మండలం దామరంచ కు వెళ్లే ప్రధాన రహదారి అతి సమీపం లో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ తో ప్రమాదం పొంచి ఉంది. బాన్సువాడ బీరుకురు వెళ్లే దారి నుండి దామరంచకు వెళ్లే ప్రధాన రహదారి పక్కన ఉన్న విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్ ప్రమాదభరితంగా మారింది. అక్కడే కళ్ళు దుకాణం ఉండడం నిత్యం వందలాదిమంది అక్కడి నుండే కాలినడకన వెళ్తున్నారు. గత వారం రోజుల కురిసిన భారీ వర్షాలతో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ నుండి నిప్పులు వచ్చాయంటూ స్థానికులు తెలిపారు.గత వారం రోజులుగా కురుస్తున్న వర్షానికి ట్రాన్స్ ఫార్మర్ చుట్టూ పిచ్చి మొక్కలు పెరగడం,నీటితో నిండి పోయింది. ట్రాన్స్‌ఫార్మర్‌కు రక్షణ ఏర్పాటు చేయాల్సి ఉన్నా సంబంధిత అధికారులు ఆ దిశగా ఎటువంటి చర్యలు చేపట్టడం లేదు. రోడ్డుకు ఫీటు దూరంలో కూడా లేకపోవడంతో ఏదైనా వాహనంతో వస్తే అంతే సంగతి, దీంతో ట్రాన్స్‌ ఫార్మర్లకు పక్కన వెళ్ళే ప్రజలు, ప్రక్కనే ఉన్న షాప్ ల వాళ్ళు భయాందోళనలకు గురవుతున్నారు. పక్కనే ఉన్న రోడ్డు గుండా నిత్యం వాహనాలు రాకపోకలు సాగిస్తుంటారు. పైగా ట్రాన్స్‌ఫారమ్ కు చెందిన విద్యుత్ వైర్లు  రోడ్డు పక్కనే ఉన్నాయి. దీనితో రోడ్డుగుండా వెళ్ళాలనుకునే వారికి ఎప్పుడు ఏమి జరుగుతుందోనని భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్‌ శాఖ అధికారులు స్పందించి ట్రాన్స్‌ఫార్మర్ కు రక్షణ కవచాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా అధికారులు,  గ్రామ మాజీ ప్రజా ప్రతినిధులు స్పందించి ట్రాన్స్‌ఫార్మర్ కు చుట్టూ కంచె వేసేలా   చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
Spread the love