అందుకే.. కథ కూడా వినలేదు

‘నా కెరీర్‌ ప్రారంభంలో ఎవరైతే నాకు సపోర్ట్‌ చేశారో, ఆయనతో (పవన్‌కళ్యాణ్‌) కలిసి నటించే అరుదైన అవకాశం ‘బ్రో’తో వచ్చింది. ఇది నన్ను నేను నిరూపించుకునే అవకాశమిది. అందుకే కథ కూడా వినకుండానే ఓకే చెప్పా. మాతక కూడా చూడలేదు. ఇది నా కెరీర్‌కి ట్రిబ్యూట్‌ ఫిల్మ్‌. నేను గురువుగా భావించే మావయ్యతో కలిసి సినిమా చేయడం చాలా సంతోషాన్నిచ్చింది. మావయ్యతో సినిమా చేస్తున్నానని తెలిసి మీ గురుశిష్యులకు బాగా కుదిరింది అంటూ చిరంజీవి చాలా ఆనందపడ్డారు. ఈ సినిమాకి ఓకే చెప్పిన సమయానికి నాకు యాక్సిడెంట్‌ జరగలేదు. అది యాదచ్చికంగా జరిగింది. టైమ్‌ విషయంలో మాత్రం ఈ చిత్రకథతో బాగా కనెక్ట్‌ అయ్యాను. ఎందుకంటే నేను కుటుంబంతో ఎక్కువ సమయం గడపటాన్ని ఇష్టపడతాను. ఈ సినిమా ఈ క్షణంలో బతకడం గురించి, మన కష్టం మనం పడితే అందుకు తగిన ప్రతిఫలం దక్కుతుందని చెబుతుంది. ఇక త్రివిక్రమ్‌ లాంటి గొప్ప టెక్నీషియన్‌ స్క్రీన్‌ ప్లే, డైలాగ్స్‌ రాసిన సినిమాలో నటించే అవకాశం రావడం అదష్టం. ముఖ్యంగా సినిమా చివరిలో నాకు, కళ్యాణ్‌ మావయ్యకి మధ్య ఆయన రాసిన సంభాషణలు కట్టిపడేస్తాయి. తేలికైన పదాలే అయినా లోతైన భావం ఉంటుంది. ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరు తమన్‌ సంగీతం అద్భుతంగా ఉందని చెప్తారు. సముద్రఖని, థమన్‌ కలిసి మ్యాజిక్‌ చేశారు. రవితేజ, ప్రభాస్‌, తారక్‌, కళ్యాణ్‌ రామ్‌, మనోజ్‌ ఇలా అందరితోను, అలాగే చిరంజీవి మావయ్యతో కలిసి నటించడం కోసం ఎదురు చూస్తున్నా’ అని సాయిధరమ్‌ తేజ్‌ మీడియాతో చెప్పారు.

Spread the love