నట సార్వభౌముడిని స్మరించుకున్న మెగాస్టార్..

నవతెలంగాణ – హైదరాబాద్: దివంగత ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఆయనను స్మరించుకున్నారు. ఎన్టీఆర్ కలకాలం మన మనస్సుల్లో మిగిలిపోతారని అన్నారు. ఆయనతో అనుబంధం తనకెప్పుడూ చిరస్మరనీయం అన్నారు. ‘నూటికో కోటికో ఒక్కరు… వందేళ్లు కాదు… చిరకాలం, కలకాలం మన మనస్సులో మిగిలిపోతారు. చరిత్ర వారి గురించి భావితరాలకి గర్వంగా చెబుతుంది. అలాంటి కారణ జన్ముడు శ్రీ ఎన్టీఆర్. తెలుగు జాతి ఘనకీర్తికి వన్నె తెచ్చిన శ్రీ నందమూరి తారక రామారావు గారితో నా అనుబంధం నాకెప్పుడూ చిరస్మరణీయం’ అని చిరంజీవి ట్వీట్ చేశారు.

Spread the love