ఎన్టీఆర్‌కు నివాళులర్పించిన జూనియర్‌ ఎన్టీఆర్‌

నవతెలంగాణ – హైదరాబాద్: నవరస నట సార్వభౌముడు ఎన్టీఆర్‌ శతజయంతి సందర్భంగా సినీనటులు బాలకృష్ణ, జూనియర్‌ ఎట్టీఆర్‌ నివాళులర్పించారు. ఆదివారం ఉదయం హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్‌ పరిసరాల్లో ఉన్న ఎన్టీఆర్ ఘాట్‌లో బాలకృష్ణ, జూనియర్‌ ఎన్టీఆర్‌తోపాటు పురంధేశ్వరి, రామకృష్ణ, నటుడు రాజేంద్ర ప్రసాద్‌ తదితరులు పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ.. ఎన్టీఆర్ శతజయంతిని ప్రపంచవ్యాప్తంగా నిర్వహించుకుంటున్నామని చెప్పారు.

Spread the love