ఎన్టీఆర్ ఘాట్లో నివాళులర్పించిన బాలకృష్ణ

నవతెలంగాణ – హైదరాబాద్: నేడు టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్లో సినీనటుడు నందమూరి బాలకృష్ణ నివాళులర్పించారు. ఎన్టీఆర్ ఘాట్‌లో ఎన్టీఆర్ కుటుంబసభ్యులు నివాళులర్పించారు. ఎన్టీఆర్ శతజయంతిని ప్రపంచవ్యాప్తంగా జరుపుతున్నారని, ఎన్టీఆర్‌ సినిమాల్లోనే కాదు.. రాజకీయాల్లోనూ అగ్రగామిగా నిలిచారన్నారని బాలకృష్ణ అన్నారు. ఎన్టీఆర్ పలు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని, రూ.2కే కిలో బియ్యం పథకం ఎన్టీఆర్ ప్రవేశపెట్టారని, మహిళలకు ఆస్తిలో సమాన హక్కును కల్పించారని బాలకృష్ణ గుర్తు చేశారు. జాతీయ రాజకీయాల్లో ఎన్టీఆర్ కీలక పాత్ర పోషించారని బాలకృష్ణ చెప్పారు.

Spread the love