నేటితో ముగియనున్న అగ్ని నక్షత్రం

నవతెలంగాణ – హైదరాబాద్: రాష్ట్రంలో ఈ నెల 4వ తేది ప్రారంభమైన అగ్నినక్షత్రం ఆదివారంతో ముగియనుంది. యేటా మే 4 నుంచి 28వ తేది వరకు అగ్నినక్షత్ర ప్రభావంతో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతుంటాయి. ఈ ఏడాది వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో ఎండ తీవ్రత తక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో, అగ్నినక్షత్రం ఆదివారంతో ముగియనుంది. కానీ, మరికొన్ని రోజులు ఎండ తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ పరిశోధన కేంద్రం తెలిపింది.

Spread the love