– రాష్ట్ర ఆగ్రో సంస్థ చైర్మన్ కాసుల బాలారాజ్
నవతెలంగాణ – బాన్సువాడ (నసురుల్లాబాద్)
సోమవారం బాన్సువాడ పట్టణంలో మున్సిపాలిటీ అధ్వర్యంలో నిర్వహించిన స్వచ్చదనం పచ్చదనం కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతథిగా విచ్చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమంను గ్రామాల్లో పట్టణాల్లో పక్కగా అమలు జరిగేలా చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా బాన్సువాడ పట్టణంలో నేడు రాష్ట్ర ఆగ్రో సంస్థ చైర్మన్ కాసుల బాలరాజ్, మాజీ డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పలు వాడల్లో స్వచ్చదనం పచ్చదనం పై ర్యాలీ నిర్వహించారు. మొక్కలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆగ్రో సంస్థ చైర్మన్ కాసుల మాట్లాడుతు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ప్రభుత్వ పథకంను పట్టణ ప్రజలందరి సహకారంతో బాన్సువాడ మరింత అభివృద్ధి చెయ్యవచ్చునాని అన్నారు. అలాగే మున్సపాలిటీ చైర్మన్ గంగాధర్ మాట్లాడుతు నేటి నుంచి 9వ తేదీ వరకు పట్టణంలో స్వచ్చదనం పచ్చదనం కార్యక్రమం ఉంటుందని, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని ప్రజలు విజయవంతం చేయాలన్నారు. మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దడం కోసం వార్డుల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు. మున్సిపాలిటీలోని అన్ని వార్డుల్లో సీసీ రోడ్లు, అంతర్గత మురుగు కాలువలు, వీధి దీపాలను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. మున్సిపాలిటీలో చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలతో పట్టణం మరింత సుందరంగా మారిందన్నారు. మున్సిపాలిటీ అభివృద్ధిలో ప్రజలందరూ భాగస్వాములు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీహరి రాజు, మేనేజర్ మల్లికార్జున్, నాయకులు అంజి రెడ్డి, క్రిష్ణ రెడ్డి , తదితరులు పాల్గొన్నారు.