— కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు అంతటి కాశన్న
నవతెలంగాణ -తాడూరు
దళితుడి ఇంటిపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు అంతటి కాశన్న డిమాండ్ చేశారు. సైదులు ఇంటిపై దాడి చేసిన వారిని జావేద్, బతికే భాస్కర్‌పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆదివారం మండలంలోని గుంతకోడూరులో అంబేద్కర్ వి గ్రహం ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దళితుడైన అంతటి సైదులు ఇంటిపై దాడిచేసి కులం పేరుతో దూషించి అవ మానపరిచిన అదేగ్రామానికి చెందిన జా వేద్, బతికే భాస్కర్‌పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సైదులు ఇం టిపై అగ్రవర్ణాలు కర్రలతో దాడి చేయడం ఎంతవరకు సమంజసమని ఆయ న ప్రశ్నించారు. గ్రామంలో అంటరానితనం కులవివక్షిత గుంత కోడూరులో కొనసాగుతుందని దీన్ని నిర్మూలించడానికి అధికారులు ప్రజా ప్రతినిధులు చర్యలు చేపట్టకపోవడం చాలా దారుణమన్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు దళితులపై దాడిచేసిన వారిని కఠినంగా శిక్షించాలని ప్రభు త్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ నాయకులు అంతటి నర్సింహ, అంతటి చంద్రయ్య, అంతటి మన్యం, అంతటి పరశురాములు, సైదులు, కృష్ణయ్య, లక్ష్మయ్య, బంగారయ్య, శ్రీకాంత్ పాల్గొన్నారు.