వచ్చే ఎన్నికల్లో కారుని గ్యారేజికి పంపించాలి..

-10 ఏళ్ల పాలనలో కేసీఆర్ అసంపూర్తి హామీలే
– ఎన్నికలు రాగనే బీఆర్ఎస్ కి కొత్త పథకాలు గుర్తుకొస్తాయి
– హుజురాబాద్ ఉపఎన్నికల్లో ఇచ్చిన హామీలే ఏమయ్యాయని ప్రశ్న
– ఎంపీ పై జరిగిన హత్యాయత్నం మాపై రుద్దాలని బీఆర్ఎస్ భావిస్తోంది
– నేషనల్ హైవే తో  తిమ్మాపూర్ రూపు రేఖలు మారాయి
– వచ్చే ఎన్నికల్లో గెలిచాక ఆగిన పద్మనాభునిపల్లి డబుల్ రోడ్డు పనులు చేస్తానని హామీ
– మరోసారి ఓటేసి గెలిపించాలని అభ్యర్థన
– దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు
నవతెలంగాణ దుబ్బాక రూరల్
10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు అసంపూర్తిగానే మిగిలాయి. వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఆ పార్టీని గ్యారేజికి పంపడం ఖాయమని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల పరిధిలోని పద్మనాభునిపల్లి ,తిమ్మాపూర్ గ్రామాల్లో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా వారికి బీజేపీ నాయకులు డప్పు చప్పుళ్ళుతో ఘనంగా స్వాగతం పలికారు.అనంతరం పద్మనాభునిపల్లి,తిమ్మాపూర్ గ్రామాల్లోని ప్రధాన రహదారి వెంట తిరుగుతూ దుబ్బాక ను మరింత అభివృద్ధి చేస్తా వచ్చే ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుపై మీ అమూల్యమైన ఓటేసి మరోసారి గెలిపించాలని అభ్యర్తించారు. 2020 ఉప ఎన్నికల్లో దుబ్బాక పేరు రాష్ట్రం మొత్తం మారు మోగిందని అన్నారు. రాష్ట్ర ప్రజలకు తప్పుడు ప్రచారాలు చేస్తున్న సీఎం కేసీఆర్ ని వచ్చే ఎన్నికల్లో ఇంటికి పంపాలని సూచించారు. హుజురాబాద్ ఉపఎన్నికల్లో దళితులకు దళిత బంధు ఇవ్వకగా పోగా ఈ సారి ఎన్నికల్లో గెలిచేందుకు బీసీ బంధు, మైనార్టీ బంధు లాంటి పథకాలను ప్రవేశపెట్టి గ్రామానికి ఒకరిద్దరికే ఇచ్చ
చేతులు దులుపుకున్నారని ఆరోపించారు. తాను గెలిచాక బీఆర్ఎస్ పార్టీ మెడలు వంచి దుబ్బాక లో నూతన బస్టాండ్, పెండింగ్ లో ఉన్న వంద పడకల ఆసుపత్రితోపాటు అనేక అభివృద్ధి పనులు జరిగాయన్నారు.చదువుకున్న యువతకు ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి ఇస్తానని హామీ ఇచ్చిన మాటలు నేటికీ అమలు కాలేదన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో రూ.1600 కోట్లు తో  ఎల్కతుర్తి నుంచి మెదక్ వరకు నేషనల్ హైవే తీసుకొచ్చానని, ఓటేస్తే సిద్దిపేట, గజ్వేల్, సిరిసిల్ల తరహా దుబ్బాక అభివృద్దికి చేస్తానని పేర్కొన్నారు.ఇటీవల మెదక్ ఎంపీ పై జరిగిన హత్యాయత్నం జరిగితే తమపై బీఆర్ఎస్ అసత్య ప్రచారాలు చేస్తోందని మండిపడ్డారు.  పద్మనాభునిపల్లి గ్రామస్తులు పలు సమస్యలు తన దృష్టికి తీసుకొచ్చారని 2023 లో గెలిచాక పెండింగ్ లో ఉన్న పద్మనాభునిపల్లి గ్రామ డబుల్ రోడ్డు పనులు చేస్తానని చెప్పుకోచ్చారు. ఆ తర్వాత తిమ్మాపూర్ లో నిర్వహించిన ఎన్నికల ప్రచారం అనంతరం పలు పార్టీలకు చెందిన యువతకు ఎమ్మెల్యే రఘునందన్ రావు బీజేపీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు.కార్యక్రమంలో 65వ బూత్ అధ్యక్షుడు సైదుగారి రాకేష్,66వ బూత్ అధ్యక్షుడు పాపగారి భవేష్,67వ బూత్ అధ్యక్షుడు రుద్రారం కర్నాకర్, బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి& శక్తి కేంద్ర ఇంచార్జ్ మర్కంటి నరేష్, బీజేపీ అధికార ప్రతినిధి అంబటి బాలేశ్ గౌడ్, బిజెపి మండల అధ్యక్షుడు అంబటి శివప్రసాద్ గౌడ్, పట్టణ అధ్యక్షుడు కృష్ణమ్మ గారి సుభాష్ రెడ్డి, దళిత మోర్చ మండల ప్రధాన కార్యదర్శి ముక్కపల్లి సతీష్ , పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు ఉన్నారు

Spread the love