బీఆర్ఎస్ లో మొదలైన చిచ్చు

నవతెలంగాణ- రాజంపేట్
రాజంపేట్ మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో ఎన్నికల ఫలితాల అనంతరం బీఆర్ఎస్ పార్టీలో చిచ్చు మొదలైంది. కద్దర్ బట్టలు వేసుకొని తిరిగే  అసమర్ధ నాయకుల వలనే కామారెడ్డి నియోజకవర్గం లో,  రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఓటమిపాలైందని  కార్యకర్తలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  కొంతమంది నాయకులు పలు కార్యకర్తలను కలుపుకొని పోకుండా ఒంటెద్దు పోకడ పోవడంతో  కెసిఆర్ ఓటమి పాలయ్యారని గ్రామాల్లో కార్యకర్తలు ముచ్చట్లు పెడుతున్నారు. మండల స్థాయిలో గ్రామాల్లో కార్యకర్తలు ఎక్కువ మొత్తంలో ఉన్నప్పటికీ  కార్యకర్తల ఓటు కూడా బీఆర్ఎస్ కు పడలేదు. ఇందులో ఎక్కువ మొత్తంలో  క్రాస్ ఓటింగ్ పడిందని  కార్యకర్తలు పేర్కొంటున్నారు. గ్రామస్థాయిలో నాయకులు  కార్యకర్తలను కలుపుకొని పోలేకపోవడంతో కార్యకర్తల్లో సమ్మతి ఎదురవుతుంది. గ్రామాల్లో మండల కేంద్రంలో సీనియర్ నాయకులు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనలేకపోవడంతోలో లోపల ఏదో అయిందని కార్యకర్తలు చెవులు కోరుకొంటున్నారు. రానున్న రోజుల్లో  కద్దర్ బట్టలు వేసుకుని రాజకీయం చేసే సీనియర్ నాయకులను మార్చకపోతే  బీఆర్ఎస్ పార్టీ కనుమరుగు అవుతుందని పార్టీ అధిష్టానం కార్యకర్తలతో చర్చించుకుని రానున్న రోజుల్లో బి ఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేలా ప్రక్షాళన చేసుకోవాలని  కార్యకర్తలు పేర్కొంటున్నారు .
Spread the love