మణిపూర్ రాష్ట్ర ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి

– మణిపూర్ సంఘటన ఖండిస్తూ నిజామాబాద్ జిల్లాలో వినూత్నంగా నిరసన
నవతెలంగాణ- కంటేశ్వర్
మణిపూర్ రాష్ట్ర ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని మణిపూర్ సంఘటనను ఖండిస్తూ నిజామాబాద్ జిల్లాలో వినూత్నంగా నిరసన శుక్రవారం నిర్వహించారు.ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా ఐద్వా మహిళా సంఘం ప్రధాన కార్యదర్శి సుజాత మాట్లాడుతూ.. దేశంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా హత్యలు, హత్యాచారాలు దాడులు లైంగిక వేధింపులు హద్దు అదుపు లేకుండా పెరిగిపోతున్నాయని ఈ సంఘటనలు ఇకపై జరగకుండా ఉండాలంటే మహిళలు చైతన్యవంతులై పోరాటాలలో భాగస్వాములు కావాలని అన్ని తరగతుల మహిళలు ఆందోళన కార్యక్రమాలు చేస్తే తప్ప ప్రభుత్వాలు మహిళలకు రక్షణ కల్పించే విధానం పై దృష్టి పెట్టి పరిస్థితుల్లో ప్రభుత్వాలు లేవు రానున్న కాలంలో మహిళలు ఆడపిల్లలు సురక్షితంగా ఉండాలి అంటే పోరాటాలు చేస్తే తప్ప మార్పులు వచ్చే పరిస్థితి కనపడటం లేదు ఈ సంఘటనలు దృష్టిలో పెట్టుకొని మహిళలు చైతన్యవంతులుగా ఐక్య పోరాటానికి సిద్ధం కావాలని మణిపూర్ నిందితులకు 24 గంటల్లో శిక్ష పడకపోతే బిజెపి భవనాలను దేశవ్యాప్తంగా ముట్టడిస్తామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు ఏ అనిత జిల్లా నాయకులు కే లావణ్ నాయకులు కళావతి పుష్ప సుబ్బలక్ష్మి లలిత లక్ష్మీ రేఖ సంధ్య తదితరులు పాల్గొన్నారు.
Spread the love