నేడు మోడీ సర్కార్ ఫాసిస్టు పద్ధతులలో దేశ ప్రజల మీద విరుచుకు పడుతోంది. అందుకు తాజా ఉదాహరణే పౌరసత్వ చట్టం-2019. ఇప్పుడు దేశ ప్రజలెదుర్కొం టున్న సంక్షోభం ఆధునిక భారతదేశ చరిత్రలోనే చాలా ప్రత్యేకమైనది. ఇలాంటిది గతంలో ఎన్నడూ ఎదురు కాలేదు. ముస్లిం, దళిత, ఆదివాసి, వామపక్షాలకు వ్యతిరేకంగా ఫాసిజం పనిచేస్తుందని అనుకోకూడదు. కొన్ని వందల వేల ఏండ్లుగా భారత సమాజం ఏర్పరుచుకున్న భిన్నత్వంలో ఏకత్వం, భిన్నసంస్కృతుల సహజీవనం, భారతీయ జీవన విధనమైన లౌకికతత్వం లాంటి గొప్ప విలువలను మోడీ సర్కార్ నేడు ధ్వంసం చేస్తూ ఉంది. అయితే ఈ ఫాసిజం ఇప్పటికిప్పుడు మొదలు కాలేదు. దీనికి బీజం 1925లో ఆరెస్సెస్ పుట్టుకతో పడింది. ఇది 2014లో బీజేపీ అధికారంలోకి రావటంతో దీని అసలు రూపం బయటపడింది. చరిత్రలో 1920 దశకంలో యూరప్‌లో ఫాసిజం పుట్టింది. సామ్రాజ్య వాదుల దోపిడీని విస్తరించి, మరింత దోచుకోవటమే దీని పని. చివరకు కమ్యూనిస్టుల (స్టాలిన్) చేతిలో చావుదెబ్బ తిన్నది నాజీయిజం. దేశంలో నేటి బ్రాహ్మణీయ ఫాసిజం ఆర్థిక దోపిడీ శక్తులతో చేతులు కలిపి (అదానీ, అంబానీ) సంపద పెరుగుదల కోసమే అధికారంలో ఉన్న పార్టీ బడితెగించి మరీ పనిచేస్తోంది. మొత్తం ఫాసిజాన్ని ఆర్థిక కోణంలో చూస్తే తప్ప సంఫ్‌ు పరివార్ దుర్మార్గాలు అర్థం కావు. ఈ శక్తులు నిత్యావసరాల ధరలు, పేదరికం, నిరుద్యోగం, ద్రవ్యో ల్బణం, రైతుల ఆత్మహత్యలు, దళిత, ఆదివాసి, మైనారిటీలపై అత్యాచారాలు, హత్యలపై ఏనాడు మాట్లాడదు. ప్రజ లకు దక్కాల్సిన సహజవనరుల దోపిడీని ప్రశ్నించదు. పై పెచ్చు రాజ్యాంగం ద్వారా నిర్మితమైన వ్యవస్థలను నిర్వీర్యపరచి, దుర్వినియోగం చేస్తూ ఉంది. ఇదంతా దేశభక్తి ముసుగులో చేయడం గమనించాలి.
కలిసి మెలిసి జీవిస్తున్న భిన్నమతాల మధ్య చిచ్చుపెట్టి ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టటం ద్వారా రానున్న పార్లమెంటు ఎన్నికల్లో రాజకీయంగా లబ్దిపొంది, అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ప్రభుత్వం ఈ ఎన్నికలకు ముందు వివాదాస్పద పౌరసత్వచట్టం తెచ్చింది. గత పదేండ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ గతంలో ఇచ్చిన వాగ్దానాలను తుంగలో తొక్కింది. మంచి పనులు చెప్పుకోవటానికి ఏమి లేక ఇప్పుడు ఏ మాత్రం అవసరం లేని దుర్మార్గ పౌరసత్వచట్టం తెచ్చి, కలిసి జీవిస్తున్న ప్రజల మధ్య విద్వేషాలు సృష్టిస్తోంది. తద్వారా ప్రజల మౌలిక సమస్యలపై నుంచి దృష్టి మరలిస్తోంది. అలాగే హిందూ ప్రజల ఓట్లను మతం మత్తులో పోల్ చేసుకొని తిరిగి అధికారంలోకి దావటానికే ఈ పన్నాగం తప్ప వేరే ఏమి లేదు. ముస్లిం మెజారిటీ దేశాలైన ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లలో మతపరమైన పీడనకు గురైన వారు భారతదేశంలోకి ప్రవేశించిన హిందూ, సిక్కు, తదితర మతాల వారికి భారత పౌరసత్వం ఇస్తారట. కానీ ముస్లింలకు ఇవ్వరట. శ్రీలంక, భూటాన్ నుంచి వలస వచ్చిన వారిని కూడా చేర్చలేదు. ఎందుకంటే ఈ రెండు దేశాలు బౌద్ధ మతదేశాలు. అలాగే మయన్మార్‌లో రోహింగ్యాలు పీడనకు గురౌ తున్నారు. వీరికి కూడా స్థానం లేదు. చట్టం ముందు ఆందరూ సమానులేనని చెప్పే రాజ్యాంగంలోని 14వ ఆధికరణ ప్రకారం మతం ఆధారంగా పౌరసత్వం ఇచ్చే అవకాశం లేదు. ఆచరణలో ఈ చట్టం ముస్లిం మతస్తులలో అభద్రతా భావం పెరిగిపోతూ ఉంది. ఇప్పటికే ముస్లింలను రెండవశ్రేణి పౌరులుగా చూస్తున్నారు. ఈ చట్టం అమలు ద్వారా ముస్లింలతో పాటు అధిక సంఖ్యలో హిందువులు కూడా ఇబ్బంది పడతారు. ముఖ్యంగా పేదలు, ఎస్సీ,ఎస్టీ ఆదివాసీలు నష్టపోతారు.
మౌలికంగా ఈ చట్టం రాజ్యాంగ వ్యతిరేకమైనది. పౌరసత్వం సవరణా చట్టం – 2019 స్పష్టంగా ఆరు మతాల పేర్లు ప్రస్తావించింది. మిగిలిన మతాల పట్ల ముఖ్యంగా ముస్లిం మతస్తుల పట్ల వివక్షను ప్రదర్శిం చింది. రాజ్యాంగంలోని లౌకిక భావనకు, ప్రవేశికకు, వ్యతిరేకమైనది. ప్రధానంగా నాలుగు ప్రాథమిక హక్కు లను ఈ చట్టం ఉల్లంఘిస్తున్నది. అధికరణ- 14 చట్టం ముందు పౌరులందరూ సమానమే. అధికరణ-15 రాజ్యం ఏ వ్యక్తి పట్ల మత ప్రాతిక మీద వివక్ష చూపకూడదు. అధికరణ-16 అవకాశాలలో పౌరులందరి మధ్య సమానత్వం పాటించాలి. మత ప్రాతిపదిక మీద అవకాశాలు నిరాకరించకూడదు. అధికరణ-25 ఏ వ్యక్తికైనా మత స్వేచ్ఛకు హామీ ఇస్తుంది. ఈ చట్టం ఈ హక్కును ఉల్లంఘిస్తున్నది. మొత్తంగా ఈ చట్టం రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విఘాతం కలిగిస్తున్నది, సమాజాన్ని విడదీస్తున్నది. కపటంతో కూడిన ఈ చట్టం మెజారిటీ మతం వారి ఆధిపత్యం కొనసాగిస్తూ, ముస్లిం ప్రజలను వివక్షకు గురిచేస్తున్నది. బీజేపీ ఎంతో కాలంగా ప్రయత్ని స్తున్న ‘హిందూ రాష్ట్ర’ ను ఏర్పాటుచేసే ఉద్దేశమే ఈ చట్టం. ఈ చట్టం రాజ్యాంగంలో పొందు పరచిన విలువలను, హక్కులను హరిస్తున్నది. కాబట్టి ప్రజలంతా ముక్త కంఠం తో వ్యతిరేకించాలి. దేశం నెత్తిన ఫాసిస్టు పాలనను రుద్దే ప్రభుత్వాన్ని సమైక్యంగా ఓడించాలి. మానవ వ్యతిరేకమైన వన్నీ చరిత్రలో మట్టి కరిచాయి. ఈ శక్తులు కూడా అంతే.
-షేక్ కరిముల్లా, 9705450705.