రైతులకు హామీ ఇచ్చి మాట తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం..

– రైతన్నకు రూ.500 బోనస్ ధర చెల్లించాలని నిరసన..
నవతెలంగాణ – వేములవాడ 
కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఇచ్చిన పిలుపుమేరకు పంటకు రూ.500 రూపాయల బోనస్ వెంటనే ఇవ్వాలని వేములవాడ పట్టణంలోని చల్మెడ నివాసంలో నిరసన కార్యక్రమం గురువారం నిర్వహించారు. రైతులకు హామీ ఇచ్చి మాట తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం అని బిఆర్ఎస్ నాయకులు అన్నారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ, సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, లు మాట్లాడుతూ రైతన్న పండించిన పంటకు రూ.500 బోనస్  అందించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 90% రైతులు దొడ్డు వరి ధాన్యాన్ని పండిస్తారని తెలిసి కూడా రాష్ట్ర ప్రభుత్వం సన్నపు వరి ధాన్యం పండిస్తానే రూ.500 రూపాయల బోనస్ అని మెలకపెట్టడం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తగదని అన్నారు.  రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి రైతన్నలను నమ్మించి గొంతు కోశారని  మండిపడ్డారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలకు అన్ని రకాల వడ్లకు బోనస్ 500 రూపాయలు చెల్లించాలని బిఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేశారు. కల్లాలలో ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తున్న వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని కోరారు. వరి ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు రోడ్లు ఎక్కుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి పట్టడం లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీల అధ్యక్షులు గోస్కుల రవి, మల్యాల దేవయ్య, పట్టణ ప్రధాన కార్యదర్శి కందుల క్రాంతి కుమార్, సహకార సంఘాల అధ్యక్షులు ఏనుగు తిరుపతిరెడ్డి, బండ నరసయ్య యాదవ్,  రామ్మోహన్ రావు, ఎంపీపీ చంద్రయ్య గౌడ్, కౌన్సిలర్లు మారం కుమార్ , నిమ్మశేట్టి విజయ్, గోలి మహేష్,  గడ్డం హనుమాన్లు, భైరగోని రమేష్, కమలాకర్ రెడ్డి, చీటి రాధా కిషన్ రావు, వెంగళ శ్రీకాంత్ గౌడ్,  దయ్యాల కమలాకర్, ఆకుల గంగరాజం, చీటి సంధ్యారాణి, నరాల దేవేందర్, శ్రీనివాస్ ,గజ్జల రమేష్, సయ్యద్ బాబా, లిక్కిడి మహేందర్, సందీప్, అప్రోజ్ తోపాటు తదితరులు పాల్గొన్నారు.
Spread the love