గుండారం గ్రామ ప్రజల సహకారం మరువలేము..

– పదవీకాలం ముగిసిన పాలకవర్గం 
నవతెలంగాణ – రామగిరి
గుండారం గ్రామ ప్రజల సహకారం మరువలేమని సర్పంచ్ ఆకుల ఓదెలు ఉపసర్పంచ్ రాచకొండ చంద్రమౌళి అన్నారు. గురువారం గుండారం గ్రామపంచాయతీ కార్యాలయంలో ఐదు సంవత్సరాల పదవీకాలం పూర్తయిన సందర్భంగా పాలకవర్గాన్ని పలువురు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మరియు పాలకవర్గం మాట్లాడుతూ గుండారం గ్రామంలో అందరి సహకారంతో అభివృద్ధి చేయడం జరిగిందని పేర్కొన్నారు. కమాన్ పూర్ మండల అధికారుల సహకారంతో గ్రామంలో పలు అభివృద్ధి చేయడం జరిగిందని అన్నారు. ఐదేళ్ల పాలనలో గుండారం లో స్మశాన వాటిక రైతు వేదిక బీసీ కమిటీ హాల్ చేత వేసే షెడ్డు పల్లె ప్రకృతి వనం బతుకమ్మ ఘాట్ గ్రామంలో పలు సిసి రోడ్లు మరియు డ్రైనేజీలు నిర్మించడం జరిగిందని పేర్కొన్నారు. గ్రామంలో సెంట్రల్ లైటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాచకొండ లక్ష్మీ రవి ఎంపీఓ శేషయ్య సూరి వార్డు సభ్యులు దండే మహేశ్వరి కిషన్ రాచకొండ మనెమ్మ రాజమల్లు, ఆకుల బాపూజి, జంగిలి అంజి ,గోస్కుల సమ్మక్క, రాములు, స్వామి, అవునూరి భాగ్యలక్ష్మి, కిరణ్ ,గ్రామ కార్యదర్శి గొర్రెపల్లి నరేష్ గౌడ్, హెచ్ఎం రాజమౌళి, సీనియర్ జర్నలిస్ట్ జబ్బార్ ఖాన్, కారోబార్ రాచకొండ భీమరాజు, ఎలువాక సతీష్, పుర ప్రముఖులు రాచకొండ శంకర్, ముదిరాజ్ గాదె అనురాధ సదయ్య, ఆకుల గట్టయ్య, సిబ్బంది పిడుగు శంకర్, అవునూరి శంకర్  అవునూరి ఆనందం, పులిపాక స్వరూప, ఇరుగు రాళ్ల నరేష్, అవునూరి కుమార్, పిడుగు అజయ్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love