సివిల్ పోలీసులతో కలిసి సమిష్ఠంగా విధులు నిర్వర్తించాలి

– కేంద్ర బలగాలకు దీపావళి శుభాకాంక్షలు
– సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత రెడ్డి 
నవతెలంగాణ హుస్నాబాద్: రాబోవు 19 రోజులలో ఎన్నికలు ఉన్నందున ప్రతి ఒక్కరూ మరింత అప్రమత్తంగా ఉండి, సివిల్ పోలీసులతో కలిసి సమిష్ఠంగా విధులు నిర్వర్తించాలని సిద్దిపేట పోలీస్ కమిషనర్ శ్వేతా రెడ్డి అన్నారు. శనివారం హుస్నాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో కేంద్ర బలగాలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. కేంద్ర బలగాలకు  దీపావళి పండుగ శుభాకాంక్షలను సిపి  శ్వేత రెడ్డి తెలియజేశారు అనంతరం కేంద్ర బలగాలతో మాట్లాడుతూ  ప్రశాంతమైన శాంతియుత వాతావరణం లో పారదర్శకంగా ఎన్నికల నిర్వహణలో ముఖ్యపాత్ర వహించాలని సూచించారు.వివిధ రాష్ట్రాల నుండి దేశ బార్డర్ నుండి వచ్చిన కేంద్ర బలగాలు సక్రమంగా విధులు నిర్వహిస్తున్నారని, సమిష్టిగా సివిల్ పోలీసులతో కలసి విధులు నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. కేంద్ర బలగాలు విదేశీ శత్రుముకలతో పోరాడుతూ దేశాన్ని దేశ ప్రజలను రక్షిస్తున్నారని అన్నారు. పోలీసులు దేశంలో ఉన్న అంతర్గత విచ్ఛిన్నకర శక్తులతో పోరాడి శాంతిభద్రతలను ప్రజలను కాపాడడం జరుగుతుందన్నారు.  వాహనాల తనిఖీ, ఫ్లాగ్ మార్చ్ సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి తగు సూచనలు సలహాలు చేశారు. క్రిటికల్ నార్మల్ పోలింగ్ కేంద్రాల గురించి సమీక్ష సమావేశం నిర్వహించారు. క్రిటికల్ పోలింగ్ కేంద్రాలలో బందోబస్తు గురించి అధికారులకు తగు సూచనలు చేశారు. బైండోవర్ సీజ్ చేసిన డబ్బులు నాన్ బేలబుల్ వారెంట్ ఎగ్జిక్యూటివ్ ప్రైవేట్ గన్స్ డిపాజిట్ ఫ్లాగ్ మార్చ్ ఎన్ఫోర్స్మెంట్ వర్క్ గురించి అడిగి తెలుసుకున్నారు. పోలింగ్ కేంద్రాలలో ప్రజలు ఓటు హక్కు వినియోగించుకునే విధంగా సంబంధిత రెవెన్యూ అధికారులతో కలిసి అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ ఏసిపి సతీష్, సీఐ కిరణ్, ఎస్ఐలు మహేష్, వివేక్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
Spread the love