వేతనాలు పెంచే వరకు పోరాటం ఆగదు

– సీఐటీయూ జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ
నవతెలంగాణ-నాంపల్లి
ఐకేపీ వీవోఏ ఉద్యోగుల వేతనాలు పెంచే వరకు పోరాటం ఆగదని, పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నాంపల్లిలో శుక్రవారం 40వ రోజు సమ్మె చేస్తున్న వీవోఏల సమ్మె శిబిరాన్ని ఆయన శుక్రవారం సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థలో 18 వేల మంది వీవోఏ లు 40 లక్షల డ్వాక్రా సంఘాల మహిళలను సామాజికంగా ఆర్థికంగా ముందు తీసుకుపోవడంలో గొప్ప పాత్ర నిర్వహిస్తున్నారన్నారు. కనీస వేతనం26 వేలు, సెర్ఫ్‌ ఉద్యోగులుగా గుర్తింపు, అర్హత గల వారిని సిసిలుగా నియమించుట, గుర్తింపు కార్డులు, ప్రమాద బీమా ఇవి ఏవి ప్రభుత్వానికి అమలు చేయడానికి అలవికానివి కూడా కాదని అయినా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రభుత్వం సమ్మె పట్ల కాలయాపన ఇలాగనే కొనసాగితే ఈనెల 29న సెర్ఫ్‌ సీఈఓ ముట్టడి ఆ తర్వాత సమ్మె మరింత సమరశీలంగా మారుతుందని హెచ్చరించారు. ఆడబిడ్డలు తమ తోటి ఉద్యోగులు హక్కుల కోసం పోరాడుతుంటే సీసీలు, ఏపీఎంలు వేధింపులకు గురి చేయడం మంచిది కాదని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బిక్షపమ్మ, వసుమతి, భవాని, కళమ్మ, చంద్రకళ, వెంకటమ్మ, కవిత, యాదమ్మ, పుష్పలత, సుజాత పద్మావతి, సైదమ్మ, జ్యోతి, మస్తాన్‌ బేగం, సంతోష, తదితరులు పాల్గొన్నారు.

Spread the love