పంచాయతీ కార్మికుల డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి 

సీఐటీయూ, అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కురెందుల సమ్మక్క
నవతెలంగాణ -తాడ్వాయి
గ్రామపంచాయతీలో పనిచేస్తున్న కార్మికుల న్యాయ పరమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, కనీస వేతనంతో పాటు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ జిల్లా యూనియన్ ప్రధాన కార్యదర్శి కురెందుల సమ్మక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ ముందు నిరవధిక సమ్మె నిర్వహిస్తున్న పంచాయతీ కార్మికుల నిరవధిక సమ్మెకు సీఐటీయూ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నుండి  మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు అంగన్వాడి టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి సమ్మక్క మాట్లాడుతూ గ్రామపంచాయతీలో పని చేస్తున్న కార్మికులకు కనీస వేతనంతో పాటు ప్రభుత్వం గుర్తించాలని, మల్టీపర్పస్ వర్కర్స్ విధానాన్ని రద్దు చేయాలన్నారు. చాలీచాలని జీవితాలతోనే జీవనాన్ని కొనసాగిస్తున్న గ్రామపంచాయతీ సిబ్బంది రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. విధి నిర్వహణలో పంచాయతీ కార్మికులు మరణిస్తే వారి కుటుంబాలకు 10 లక్షలు ప్రకటించి, వారి కుటుంబాలను ఆదుకోవాలని అన్నారు. కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు గుండారపు నిర్మల, సరిత, రమా, వివిధ గ్రామ పంచాయతీల పంచాయతీ కార్మికులు, సిబ్బంది తదితరు పాల్గొన్నారు.
Spread the love