సమస్యలు పరిష్కరించని ప్రభుత్వం రద్ధు కావాలి

– మండల కేంద్రంలో పంచాయతీ కార్మికుల ధర్నా 

– బస్టాండ్ అవరణం వద్ద ప్రధాన రోడ్డుపై బైఠాయించి నిరసన 
– పరిష్కారంలో చోరవ చూపని ప్రజాప్రతినిధులు రాజీనామ చేయాలని డిమాండ్ 
– పంచాయతీ కార్మికుల ధర్నాకు బీఎస్పీ నాయకుల మద్దతు
నవతెలంగాణ-బెజ్జంకి 
గత నెల రోజులుగా తమ దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని నిరవధిక సమ్మె చేస్తున్న ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని..పంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కరించని ప్రభుత్వం వేంటనే రద్ధు కావాలని మండలంలోని పంచాయతీ కార్మికులు అవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ పంచాయతీ కార్మికులు సోమవారం మండల కేద్రంలోని బస్టాండ్ అవరణం వద్ద ప్రధాన రోడ్డుపై బైఠాయించి సుమారు గంటపాటు ప్రభుత్వానికి,స్థానిక ప్రజాప్రతినిధులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నా చేపట్టారు. పంచాయతీ కార్మికుల ధర్నాను బీఎస్పీ నాయకులు సందర్శించి రోడ్డుపై బైఠాయించి మద్ధతు తెలిపారు.ఈ సందర్భంగా బీఎస్పీ కరీంనగర్ జిల్లా కార్యవర్గ సభ్యుడు పెద్దొల్ల శ్రీనివాస్ యాదవ్ మాట్లాడారు. సీఎం కేసీఆర్ కార్మికుల హక్కులను కాలరాస్తు పారిశుధ్య కార్మికులపై ప్రతాపం చూపడం తగదన్నారు.గత నెలరోజులుగా పంచాయతీ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మె చేస్తున్న వారి సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం చేతగానితనమేనని..వేంటనే ప్రభుత్వాన్ని రద్దు చేసుకోవాలన్నారు.స్థానిక ప్రజాప్రతినిధులు పారిశుధ్య కార్మికులతో చాకిరి చేయించుకుని తీర సమయానికి వారివైపు కన్నెత్తి చూడడం లేదని..పంచాయతీ కార్మికుల్లో అత్యధికంగా బడుగుబలహీన వర్గాలకు చెందినవారే ఉండడంతోనే సమస్యల పరిష్కారంలో వివక్ష చూపుతున్నారని..స్థానిక ప్రజాప్రతినిధులు వేంటనే రాజీనామాలు చేయాలని బీఎస్పీ మండల ప్రధాన కార్యదర్శి లింగాల శ్రీనివాస్ అసహనం వ్యక్తం చేశారు.వివక్ష చూపుతున్న ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పడానికి రానున్న ఎన్నికల్లో పంచాయతీ కార్మికులు బీఎస్పీ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేల కృషి చేయాలని..బహుజన రాజ్యంలో పంచాయతీ కార్మికులకు పెద్దపీట వేస్తుందని శ్రీనివాస్ సూచించారు. బీఎస్పీ నాయకుడు ఎగోల్లపు వెంకన్న గౌడ్,పంచాయతీ కార్మికుల మండల కమిటీ గౌరవాధ్యక్షుడు బోనగిరి లక్ష్మన్,మండలాధ్యక్షుడు కొంకటి అశోక్,ఉపాధ్యక్షులు మిట్టపల్లి లక్ష్మన్,బోనగిరి లచ్చవ్వ, ప్రధాన కార్యదర్శి కొరేపు శివ,మండలంలోని అయా గ్రామాల పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు.
Spread the love