Saturday, May 30, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: కలెక్టర్

రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: కలెక్టర్

- Advertisement -

నవతెలంగాణ – ఉప్పునుంతల : ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు పూర్తిస్థాయిలో చేరేలా అధికారులు సమర్థవంతంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ సూచించారు. శనివారం ఉప్పునుంతల మండలంలోని మామిళ్లపల్లి, లక్ష్మాపూర్ గ్రామాల్లో పర్యటించిన ఆయన ఉపాధి హామీ పనులు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, జనగణన ప్రక్రియ, వరి కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. మామిళ్లపల్లిలో చెరువు కట్టపై కొనసాగుతున్న ఉపాధి హామీ పనులను తనిఖీ చేసి, పనుల నాణ్యత, కార్మికుల హాజరు, వేతనాల చెల్లింపులపై ఆరా తీశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెరిగేలా పనులను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించి, లబ్ధిదారులతో మాట్లాడారు. నిర్మాణాలను గడువులోగా పూర్తి చేసి అర్హులకు అందజేయాలని, నాణ్యత విషయంలో రాజీ ఉండరాదని అధికారులను ఆదేశించారు.

జనాభా గణన ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్, ప్రతి కుటుంబ వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలని, జూన్ 1 నాటికి తొలి విడత జనగణన పూర్తి చేయాలని సూచించారు. తర్వాత మామిళ్లపల్లి, లక్ష్మాపూర్ వరి కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతులతో మాట్లాడారు. ధాన్యం కొనుగోలు, తూకం, చెల్లింపుల్లో పారదర్శకత పాటించాలని, రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు ఆదేశించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించేందుకు లారీలను సిద్ధంగా ఉంచాలని సూచించారు. రైతులు తమ పంటకు గిట్టుబాటు ధర పొందేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అనంతరం మామిళ్లపల్లి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -