వసతిగృహంలో ఆకతాయిలు చొరబడిన వారిని పట్టుకొని శిక్షించాలి

The hooligans should catch and punish the intruders in the hostel– విద్యార్థీనుల ఆందోళన…
– బాలికల బిసి హాస్టల్ సమస్య పరిష్కరించాలి..
నవతెలంగాణ – డిచ్ పల్లి
డిచ్ పల్లి మండల కేంద్రంలోని బాలికల బిసి వసతిగృహంలో  ఆకతాయిలు చొరబడినవారిని పట్టుకొని వారిని కఠినంగా శిక్షించాలని, నేలలోని ఉన్న సమస్యలు పరిష్కరించాలని పి డి ఎస్ యూ విద్యార్థి సంఘం డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కర్క గణేష్ మాట్లాడుతూ మంగళవారం రాత్రి 12 గంటల సమయంలో డిచ్పల్లి మండలంలోని బాలికల బిసి హాస్టల్ లోకి ఆకతాయిలు రావడం జరిగిందన్నారు. విద్యార్థినిలు భయాందోళన గురి కావడం,నిద్రలేకుండా అయోమయ పరిస్థితిలో విద్యార్థులు ఉన్నారన్నారు. గతంలోనే హాస్టల్ విద్యార్థులకు అసౌకర్యవంతంగా ఉందని వెంటనే హాస్టల్ నుంచి అన్ని సౌకర్యాలు ఉన్న భవనంలోకి మార్చాలని సొంత భవనం నిర్మించాలని జిల్లా అధికారులకు తెలిపారని అన్నారు. కానీ ఇప్పటికీ హాస్టల్ మార్చకుండా సొంతభవనం నిర్మించకుండా జిల్లా అధికారులు నిర్లక్ష్యం చేయడం బాధాకర మన్నారు. హాస్టల్ చుట్టూరా పొదలు, చెరువు, పక్కనే కల్లు బట్టి ప్రాంతంలో విద్యార్థినిలు భయాందోళనలో ఉంటున్నారన్నారు. వెంటనే సౌకర్యాలు ఉన్న వసతి గృహం లోకి విద్యార్థులను పంపాలని అదేవిధంగా సొంత భవనం నిర్మించాలని అధికారులను ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హాస్టల్లో అన్ని సీసీలు పనిచేయకపోవడం అసౌకర్యాలు ఉండడం విద్యార్థినిలకు ఇంకా భయాందోళనలో గురి చేస్తుందన్నారు.అసిస్టెంట్ బిసి వెల్ఫేర్ ఆఫీసర్ కిషన్ మాట్లాడుతూ 15 రోజుల్లో హాస్టల్ని వేరే చోటికి షిఫ్ట్ చేస్తామని హామీ ఇవ్వడంతో విద్యార్థి నాయకులు, విద్యార్థులు ఆందోళనను విరమించుకున్నారు. ఒకవేళ 15 రోజుల్లో గా హాస్టల్ ని పంపించకుంటే ఆందోళన ఉదృతం చేస్తామని అధికారులను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రగతిశీల యువజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు సాయిబాబా, డిచ్పల్లి మండల అధ్యక్ష ,ప్రధాన కార్యదర్శులు శివ, రాజేష్ నాయకులు రాజేందర్, హాస్టల్ విద్యార్థినిలు పాల్గొన్నారు.
Spread the love