ఆశా వర్కర్లకు ఎగ్జామ్ పెట్టే ఆలోచనలను విరమించుకోవాలి

– జిల్లాలో అన్ని పీహెచ్సీ ల వారిగా వినతి పత్రాలు అందజేత
– సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ ప్రభుత్వానికి డిమాండ్
నవతెలంగాణ – కంటేశ్వర్
ఆశ వర్కర్లకు ఎగ్జామ్ పెట్టే ఆలోచనను విరమించుకోవాలని జిల్లాలోని అన్ని పిహెచ్సి ల వారిగా వినతి పత్రాలు అందజేస్తున్నామని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం నిజామాబాద్ జిల్లాలో పిహెచ్సి ల వారిగా మెడికల్ అధికారులకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వం ఆశా వర్కర్లకు ఎగ్జామ్ పెట్టి అందులో అర్హత సాధించిన వాళ్లనే కొనసాగించి మిగతా వాళ్లను తీసేయాలన్నా ఆలోచనను విరమించుకోవాలని సిఐటియు జిల్లా కార్యదర్శి ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఆమె మాట్లాడుతూ గత 16 సంవత్సరాలుగా గ్రామీణ ప్రాంతాలలో పేదలకు అందుబాటులో ఉంటూ వారికి వైద్యం చేస్తూ గ్రామీణ ప్రాంతాలలో ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్న ఆశ వర్కర్లపై ఇటువంటి అనాలోచిత విధానాన్ని అమలు చేయడం దుర్మార్గమని అన్నారు స్కూటమ్ డబ్బాలను ఆశ వర్కర్ల ద్వారా మోపించడంతో రోగికి ఉండే టీబీ రోగాలు ఆశా వర్కర్లకు కూడా అంటుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు అధికారుల వేధింపులు ఆపాలని పని భారం తగ్గించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో విజయ రాణి లక్ష్మీ నవనీత
ఆశా వర్కర్లు పాల్గొన్నారు.

 

Spread the love