ఆదర్శ మహిళ అమరజీవి తుమ్మలపల్లి శాంతమ్మ

– భర్త మార్గంలో నడిచిన ధన్యజీవి
– సంస్మరణ సభలో వక్తలు
నవతెలంగాణ-కారేపల్లి
సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ నేత తుమ్మలపల్లి అప్పయ్య సహధర్మచారిణి తుమ్మలపల్లి శాంతమ్మ ఆదర్శజీవి అని ప్రముఖ కవి జయరాజ్‌, సీపీఐ(ఎంఎల్‌) మాస్‌ లైన్‌ రాష్ట్ర నాయకులు రాయల చంద్రశేఖర్‌, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్యలు అన్నారు. కారేపల్లి మండలం మాధారంలో సోమవారం తుమ్మలపల్లి శాంతమ్మ సంస్మరణ సభ నిర్వహించారు. శాంతమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లుఆర్పించారు. కవి జయరాజ్‌ అమరులను కీిర్తిస్తూ పాటలు పాడారు. ఈ సందర్బంగా వక్తలు మాట్లాడుతూ తుమ్మలపల్లి అప్పయ్య తాను నమ్మిన సిద్దాంతం కోసం కుటుంబానికి మార్గనిర్ధేశం చేసి అదే మార్గంలో నడిపించారన్నారు. అప్పయ్య అమరుడైనా జీవతభాగస్వామి శాంతమ్మ తన కుమారులను కమ్యూనిస్టులగా మార్చారన్నారు. ఉద్యమంలో పెద్దకుమారుడు తుమ్మలపల్లి హన్మంతరావు అమరుడైనాడని, చిన్నకుమారుడు సీనియర్‌ జర్నలిస్టుగా తుమ్మలపల్లి ప్రసాద్‌ అదే మార్గంలో ఆదర్శభావాలతో నడవటం ఆ కుటుంబం ఉక్కు క్రమశక్షణకు నిదర్శనమన్నారు. అమరులైన తుమ్మలపల్లి అప్పయ్య-శాతమ్మ, తుమ్మలపల్లి హనుమంతరావు నేటి తరానికి మార్గదర్శకలన్నారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు మున్సిఫల్‌ చైర్మెన్‌ దమ్మాలపాటి వెంకటేశ్వర్లు(డీవీ), సీపీఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్‌, సీపీఐ(ఎంఎల్‌) మాస్‌ లైన్‌ నాయకులు చండ్రా అరుణ, గుగులోత్‌తేజా, ఎన్వీ రాకేష్‌, దారావత్‌ సక్రు, పులకాని సత్తిరెడ్డి, రావుల నాగేశ్వరరావు, కాంగ్రెస్‌ నాయకులు పులగండ్ల మాధవరావు తదితరులు పాల్గొన్నారు.

Spread the love