కామ్రేడ్‌ చరణ్‌పై అక్రమకేసును ఉపసంహరించుకోవాల్ణి

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
సీపీఐఎంఎల్‌ ప్రజా పంథా భద్రాచలం డివిజన్‌ కార్యదర్శి కామ్రేడ్‌ చరణ్‌పై చర్ల మండలం పోలీసులు, మావోయిస్టు అని పెట్టిన అక్రమ కేసును ఉపసంహరించుకోవాలని ఆ పార్టీ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ఆ పార్టీ కార్యదర్శి పోటు రంగారావు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. గొత్తికోయల సమస్యలపై సోమవారం భద్రాచలంలో పార్టీ తలపెట్టిన ప్రదర్శన కరపత్రాలను పంచుతూ ప్రచారం చేస్తున్న చరణ్‌పై మావోయిస్టు అని కేసు మోపడం పోలీసుల అక్రమ కేసుల బనాయింపును తెలుపుతుందన్నారు. చరణ్‌ ఇటీవల వరద బాధితుల సమస్యలపై, చర్ల మండలం సమస్యలపై, ఇసుక మాఫియాపై పోరాటాలు చేశారనే కక్ష్య తోనే ఈ అక్రమ కేసు నమోదు చేశారని రంగారావు విమర్శించారు.

Spread the love