పంచాయతీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలి..

– రాస్తారోకో చేపట్టిన పంచాయతీ కార్మికులు.
– పంచాయతీ కార్మికుల మండల అధ్యక్షుడు పరుశురాం.
నవతెలంగాణ – ఊరుకొండ 
గ్రామీణ ప్రాంతాల్లో ప్రతినిత్యం తక్కువ వేతనాలతో వెట్టిచాకిరి చేస్తున్న గ్రామపంచాయతీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని
పంచాయతీ కార్మికుల మండల అధ్యక్షుడు పరుశురాం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం సిఐటియు, తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ మరియు వర్కర్స్ యూనియన్, జేఏసీ పిలుపుమేరకు 33వ రోజు సమ్మెలో భాగంగా కల్వకుర్తి – జడ్చర్ల ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు.  ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామపంచాయతీ కార్మికులను పర్మినెంట్ చేయాలని, కనీస వేతనం నెలకు రూ.26000/- ఇవ్వాలని, ప్రమాద బీమా 10 లక్షలు, పిఎఫ్, ఈఎస్ఐ అమలు చేస్తూ.. మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు జగన్, గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ నాయకులు రాములన్న, మల్లమ్మ, తిరుపతమ్మ, పరుషరామ్, బాలస్వామి, బాలయ్య, జంగయ్య, బాల్ చెన్నమ్మ, బాలమ్మ, ఆంజనేయులు, జంగయ్య, చెన్నయ్య, నారాయణ, జంగయ్య, తదితరులు పాల్గొన్నారు.
Spread the love