నియోజకవర్గ సమస్యలపై అసెంబ్లీలో గలమెత్తిన ఎమ్మెల్యే

నవతెలంగాణ – ఆర్మూర్   

నియోజకవర్గంలోని గత పది సంవత్సరాల నుండి అభివృద్ధి జరగలేదని ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు.. రాష్ట్ర శాసనసభ సమావేశాలలో భాగంగా శుక్రవారం అసెంబ్లీలో మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీ, బిసి మైనారిటీ మహిళలు అద్దె ఇండ్లలో ఉంటూ నరకయాతన అనుభవిస్తున్నారని,, పట్టణంలోని వంద పడకల ఆసుపత్రి పేరుకి ఉందని అసౌకర్యాలకు నిలయంగా ఉందని పేదవారికి వైద్యం గగనమైందని అన్నారు. నియోజకవర్గంలోని నందిపేట్ మండలంలోని లక్కంపల్లి సేజ్ ప్రారంభించిన ఎన్నో ఏళ్లు గడుస్తున్న ఇప్పటివరకు ఒక్క ఇండస్ట్రీ రాలేదని, ఉమ్మడి జిల్లాకు న్యాయం చేయాలని అన్నారు.. నేటి యువత మత్తు పదార్థాలకు గంజాయి కి బానిస అయినారని ,ఒక గ్రామంలో 434 మంది యువకులు ఉద్యోగాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. నా నియోజకవర్గమే కాకుండా అదిలాబాద్, ఖమ్మం లో ఉన్న నిరుద్యోగులపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని, గత రెండు నెలల నుండి నియోజకవర్గంలో పలు పాఠశాలలను పరిశీలించినట్టు అసౌకర్యాలకు నిలయంగా మారినవని, సీసీ రోడ్లు డ్రైనేజీ ,ఎన్ఆర్ఈజీఎస్ బిల్లులు రావడం లేదని, ఇరిగేషన్ ప్రాజెక్టులపై దృష్టి పెట్టాలని, ప్రస్తుతం ఉన్న టీఎస్ ఆర్టీసీ బస్టాండ్ మోడల్ బస్టాండ్ గా ఏర్పాటు చేయాలని,, నియోజకవర్గంలోని 40 గ్రామాల్లో గ్రామపంచాయతీలు లేవని ,,ప్రోటోకాల్ ప్రకారం తగిన గౌరవం ఇవ్వాలని కోరినారు.
Spread the love