హంతకుడిని…

హంతకుడిని...నేను ఏమని పరిచయం చేసుకోను..
నేను 140 కోట్ల భారతీయులలో ఒకడను..
నేను నిత్య హంతకుడిని..
నేను ఎవరిని హత్య చేశాననేగా మీ ఆలోచన..
చెప్పుతాను చెప్పుతాను.. నేను హత్య చేసేది ‘ఆకలి’ ని..
ఆశ్చర్య పడకండి నేను చెప్పింది నిజమే..
నేను ‘ఆకలిని’ పూట పూట హత్య చేస్తుంటాను..
మాడిపోయిన నా పేగులు అరిచే ఆర్తనాదాలను
బయటి ప్రపంచానికి వినిపించకుండా అడ్డు పడతాను..
ఎండిన నా డొక్కలు ఎవరికి కనిపించకుండా
మసిగుడ్డలతో కప్పుతాను.. ఒక్క పూటకు తిండికి నోచుకోకుండా
నిత్యమూ ఆకలిని హత్య చేస్తూనే ఉంటాను..
నేను 56 ఇంచుల ఛాతిగల పాలకుడి ఏలుబడిలో ఓటరును..
అయిననూ ఒక్క పూట తిండికి నోచుకోను..
హంతకులే పాలకులైన దేశంలో
నేను చేసే హత్యకు శిక్ష ఉంటే బాగుండునేమో..
ఆ జైలులో అయినా టైం ప్రకారం బువ్వ దొరికేదేమో..
ఏ నాయస్థానము నన్ను హంతకుడిగా గుర్తిస్తాదేమో..
నేను చేసే ‘ఆకలి’ హత్యలకు అడ్డు కట్ట వేస్తాదేమో..
దేశంలో ఒక్క పూటకి తిండికి
నోచుకోని పేదలు ఎందరో.. ఎందరో..
– ఏ. అజరు కుమార్‌, 8297630110

Spread the love