నవ్వుల్‌ పువ్వుల్‌

రెండే మాటలు
చైతన్య : మనం ఆడాళ్ళు ఎక్కువ మాట్లాడతారు అనుకుంటాం కదా… అది తప్పు.. నిన్న ఒక చీరల షాపుకెళ్ళా.. పాపం వాళ్ళు ‘రెండే’ మాటలు మాట్లాడుతున్నారు..
సుధీర్‌ : అరే.. ఆడాళ్ళు తక్కువ మాట్లాడటమా? ఇంతకీ ఏం మాట్లాడుతున్నారు?
చైతన్య : ఒకటి… ఈ డిజైన్‌లో వేరే కలర్‌ చూపించు! రెండోది…. ఈ కలర్లో వేరే డిజైన్‌ చూపించు.
బాల్య వివాహం
రాజు : పక్కింటి దంపతులు ఎప్పుడూ చిన్నపిల్లల్లా పోట్లాడుకుంటారెందుకు..?
సుందర్‌ : వాళ్ళది బాల్య వివాహం లెండి..!

అప్పుడే కష్టాలా?
కిరణ్‌ : నీ కళ్ళల్లోకి చూస్తుండిపోతే అన్ని కష్టాలు మరిచిపోతాను డియర్‌..!
సుజాత : ఇంకా మన పెళ్ళే కాలేదు. అప్పుడే నీకు కష్టాలేమిటి..!
నీరసం
వికాస్‌ : మీ ఆఫీసులో లంచాలు లేవా సార్‌
కార్తీక్‌ : అవును ఆ విషయం మీరెలా కనిపెట్టారు?
వికాస్‌ : ఆఫీసుకి నీరసంగా బయల్దేరుతుంటేను.

మీసమున్న మగవాడు..
సుధీర్‌ : ఇప్పటివరకు మీసమున్న మగవాడెవరు నా వంటి మీద చెయ్యి వెయ్యలేదు తెలుసా?
వెంకట్‌ : అంటే ఇప్పటిదాకా మిమ్మల్ని ఆడవారే కొట్టారన్నమాట..!
అల్లుడా మజాకా!!
భర్త : కొత్త స్కూటర్‌ కొనివ్వందే పండక్కిరానంటే అల్లుడుగారికి కొనిచ్చాం కదా. పండగవెళ్ళి నెల రోజులైనా ఇంకా వెళ్ళడేమిటి?
భార్య : కలర్‌ టీవీ కొనిచ్చేదాకా కదలడటండి.
స్వీట్‌ హౌస్‌
రాజు : మీ ఇంటి గోడల నిండా పుట్టలకొద్దీ చీమలున్నాయేమిటి?
గిరి : మాది స్వీట్‌హౌస్‌ కదా.. ఈ ఇంటికి ఇటుకలు బదులుగా మైసూర్‌ పాక్‌ ముక్కలని ఉపయోగించాను.
మూడు పదాలు..
జూనియర్స్‌ని సీనియర్స్‌ ర్యాగింగ్‌ చేస్తున్నారు.
సీనియర్‌ : మూడు బూతు మాటలు చెప్పు నిన్ను వదిలేస్తాం…!
జూనియర్‌ : (క్షణం తర్వాత రాజు ఇలా చెప్పాడు)
టెలిఫోన్‌ బూతు, మిల్క్‌ బూతు, పోలింగ్‌ బూతు.
ఇలా చెప్పేడేంటో
సుబ్బాయి: ఒరే చంటిగా ఎరేంజ్‌డ్‌ మేరేజికీ లవ్‌
మేరేజికి తేడా ఏంట్రా.
చంటి : ఎరేంజ్డ్‌ మేరేజి అంటే వేరే వాడి లవర్ని మనం పెళ్లి చేసుకోవడం, అదే లవ్‌ మేరేజ్‌ అంటే మన లవర్‌ని మనమే పెళ్లి చేసుకోవడం.
ఎందుకలా…
రాము : పెళ్ళిలో ఎప్పుడూ అమ్మాయి ఎడం పక్కన, అబ్బాయి కుడి పక్కన కూర్చుంటారెందుకు?
రాజా : పెళ్ళనేది ఎకౌంట్‌ పుస్తకం లాంటిది. రాబడి కుడి పక్క, వ్యయం ఎడమ పక్క వేసినట్టే ఇది కూడా.
దొంగ కష్టాలు…
1వ దొంగ : ఏమయిందిరా… సొమ్మంతా మూట కట్టుకోకుండా అలా తెల్లబోయి చూస్తున్నావ్‌?
2వ దొంగ : అందరూ దీన్ని బ్యాంక్‌ అంటుంటే సొమ్ముంటదనుకుని వచ్చా. ఇది బ్లడ్‌ బ్యాంక్‌రా. లోపలన్నీ నెత్తురు సీసాలే!
1వ దొంగ : కనీసం అఆ లైనా నేర్చుకోరా అంటే… చిన్నప్పుడు వినక పోతివి. ఇప్పుడు ఏడ్చి ఏం లాభం?

Spread the love