చెరువు నిండా నీళ్లు ఎండిపోతున్న నార్లు..

నవతెలంగాణ-గోవిందరావుపేట

లక్నవరం చెరువు నిండా నీళ్లు ఉన్నాయి అయినా నార్లు ఎండిపోతున్నాయి రైతులు తలలు పట్టుకుంటున్నారు. అంగట్లో అన్ని ఉన్నాయి అల్లుడి ఇంట్లో శని ఉందన్నట్టు నిండా నీళ్లు ఉన్న నాట్లు వేసుకోలేదు పరిస్థితుల్లో రైతులు ఉన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కాలువలు భారీగా గండ్లు పడ్డాయి. ప్రభుత్వం ఇప్పట్లో కాలువల కండ్లను పూడ్చేలా లేదు. రైతులు తలా కాస్త డబ్బులు పోగు చేసి గండ్లు పోసుకున్న అవి ఆగడం లేదు. పోసుకోలేక కొన్నిచోట్ల పోసిన ఆగక మరికొన్ని చోట్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారు. పదివేల ఎకరాల్లో కనీసం ఇప్పటివరకు ఐదువేల ఎకరాలు కూడా నాట్లు వేయలేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవాలి. నార్లు కూడా ఇప్పటికీ నెల 15 రోజుల నుండి రెండు నెలల వయసుకు చేరుకున్నాయి. ఇంత వయసు ముదిరిన నార్లు నాట్లు వేసిన దిగుబడులు ఆశించిన స్థాయిలో రావని పలువురు రైతులు అంటున్నారు. ఇప్పటికే రైతులు ఎరువులు పురుగు మందులను ముందస్తుగా తెచ్చుకోవడం జరిగింది. నార్ల సంగతి నాట్ల సంగతి దేవుడెరుగు తెచ్చిన పెట్టుబడి వాపస్ ఇచ్చిన తీసుకోరు ఏమి చేయాలి రా దేవుడ అని నెత్తి నోరు మొత్తుకుంటున్నారు. దుంపెల్లి గూడెం బూసాపురం రంగాపురం ప్రాంతాల్లో 70% నాటు వేశారు. మిగతా ప్రాంతాల్లో ఎక్కడ 10% కూడా నాట్లు వేయలేదు. ప్రభుత్వం చేతులెత్తేసింది రైతులు ఎంత ప్రయత్నించినా సాధ్యం కావడం లేదు. ఇది మండల వ్యాప్తంగా లక్నవరం చెరువు కింద ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి. యాసంగి చూసుకుందామంటే చెరువులో నీరు నిలువ ఉండదు. లీకేజీల రూపంలో అంతా వృధా అయిపోతుంది వర్షాకాలంలో పంట పండించుకోలేము యాసంగిలో అందరూ సాగు చేసుకుంటే నీరు సరిపోదు ఇది ప్రస్తుతం లక్నవరం ఆయకట్టు దుస్థితి. ఏమి చేయాలో పాలు పోవడం లేదు అంటున్నారు రైతులు. ప్రభుత్వం ఇచ్చిన రైతుబంధు తో కుటుంబం గడవదు ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పటికే కూలీలు పని దొరకడం లేదని చాలామంది పట్టణాలకు వలస వెళ్లిపోయారు ఇక మిగిలింది రైతులే కూలీ నాలి చేయలేరు వలస పోలేరు కుటుంబాన్ని సాగేది ఎట్లా? ఈ ప్రశ్న క్రింది మధ్యతరగతి రైతాంగాన్ని ఇప్పుడు వేధిస్తున్న ప్రశ్న ప్రభుత్వం ఏమో అంటి పట్టనట్టు వ్యవహరిస్తోంది. గవర్నమెంట్ తలుసుకుంటే యుద్ధ ప్రాతిపదికన గండ్లు పూర్తి చేసి నీటిని అందించవచ్చు ఇప్పుడున్న అధికారులకు ప్రభుత్వానికి ఆతీరిక లేదు అంతా ఎన్నికల బిజీలో ఉన్నారు. వర్షాలు పోయి 20 రోజులైనా 163 వ జాతీయ రహదారి పై గుండ్ల వాగు వంతెనను పట్టించుకున్న పాపాన పోలేదు అలాంటిది లక్నవరం చెరువు కింది రైతాంగాన్ని ఎవడు పట్టించుకుంటాడు అన్నట్టుగా ఉంది ప్రభుత్వ వైఖరి.
ప్రభుత్వం వెంటనే గండ్లను పూర్తి చేసి సాగు నీరు అందించాలి. భూక్య లచ్చిరాం పాపాయిపల్లి
వరద బాధితులను వరద నష్టాన్ని పట్టించుకోని ప్రభుత్వం ఇప్పటికైనా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కాలువగడ్లను వెంటనే పూర్తిచేసి సాగునీరు అందించి నాట్లు వేసుకునేందుకు సహకరించాలి. రైతన్న ఆదుకోలేదు ప్రభుత్వం ఉన్న లేకున్నా ఒకటే. అధికారులు ముద్దు నిద్ర వీడి కాస్త కాలువ గళ్ళ పై దృష్టి పెడితే వర్షాకాలం నాట్లు వేసుకొని ఏదోరకంగా పంట తీస్తం. ప్రభుత్వము అధికారులు పట్టించుకోకపోతే రైతులకు ఆత్మహత్యలు తప్పవు. రైతుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. పరిస్థితిని చెక్కబెట్టేందుకు పాలకులు ముందుకు రావాలి.
Spread the love