– లచ్చన్ గ్రామంలో కంపు కొడుతున్న మురికి కాలువలు
– అవస్థలతో కాలనీవాసులు
నవతెలంగాణ – మద్నూర్
తెలంగాణ రాష్ట్రంలో సర్పంచుల పదవీకాలం ముగియగానే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అధికారుల పాలన కొనసాగిస్తుంది పట్టింపు లేని ప్రత్యేక అధికారుల పాలనతో గ్రామాల్లో మురికి కాలువలు శుభ్రపరచక కంపు కొడుతున్నాయి. అనటానికి మద్నూర్ మండలంలోని లచ్చన్ గ్రామంలో మురికి కాలువల పరిస్థితి అద్వాన్నంగా తయారైంది. మురికి కాలువలు శుభ్రపరచక అపరిశుభ్రతతో కంపు కొడుతున్న మురికి తో కాలనీవాసులంతా అవస్థలు ఎదుర్కొంటున్నామని లచ్చన్ గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మురికి కాల్వల శుభ్రత పట్ల గ్రామ కార్యదర్శికి గ్రామ ప్రత్యేక అధికారికి తెలియజేసిన పట్టించుకోవడంలేదని ఆ గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు మండుతున్న ఎండలతో మురికి వాసన అద్వాన్నంగా తయారైందని కంపు కొడుతున్న మురికి కాలువలతో ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గ్రామ ప్రజల అవస్థలు పట్టించుకునే అధికారులు లేరని ఆ గ్రామ ప్రజల్లో ఆవేదన వ్యక్తం అవుతుంది. అసలు దగ్గర పడుతున్న పార్లమెంట్ ఎన్నికలు ఎన్నికల్లో అధికారులు బిజీ బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రత్యేక అధికారుల పాలన గ్రామ ప్రజలకు శాపంగా మారిందని గ్రామ శుభ్రత పట్ల ఏమాత్రం పట్టించుకోవడంలేదని లచ్చన్ గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు. అపరిశుభ్రతతో కంపు కొడుతున్న మురికి కాలువల పట్ల సంబంధిత ఉన్నత అధికారులు వెంటనే స్పందించి ప్రజలు అనారోగ్యం గురి కాకుండా చూడాలని ఆ గ్రామస్తులు ప్రభుత్వ అధికారులను కోరుతున్నారు.