కికెట్‌ ప్రీమియర్‌ లీగ్‌ సీజన్‌ ప్రారంభం

ఐక్యత ఫౌండేషన్‌ చైర్మన్‌ సుంకిరెడ్డి రాఘవేందర్‌ రెడ్డి
నవతెలంగాణ-తలకొండపల్లి
ఆటల్లో గెలుపు ఓటములు సమానంగా స్వీకరించాలని ఐక్యత ఫౌండేషన్‌ చైర్మన్‌ సుంకిరెడ్డి రాఘవేందర్‌ రెడ్డి అన్నారు. శుక్రవారం తలకొండపల్లి ప్రీమియర్‌ లీగ్‌ సీజన్‌ ఐక్యత ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రీమియర్‌ లీగ్‌ను ఐక్యత ఫౌండేషన్‌ చైర్మన్‌ సుంకిరెడ్డి రాఘవేందర్‌రెడ్డి ప్రారంభించారు. ఈ ఆటల్లో 8 జట్లు పాల్గొన్నాయని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొదటి బహుమతి రూ. 25 వేలు, రెండోవ బహుమతి రూ. 15 వేలు, మూడోవ బహుమతి రూ. 10 వేలు, ఇతర ఖర్చులు ఐక్యత ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఆటల్లో గెలుపు ఓటములను సమానంగా చూడాలని తెలిపారు. కార్యక్రమంలో తలకొండపల్లి ఉప సర్పంచ్‌ పద్మా అనిల్‌, బోలె యాదగిరి, బోలె శీను, ఈసారి శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love