పశు వైద్య డాక్టర్ ని ఆకస్మికంగా బదిలీ చేసిన దానిని రద్దు చేయాలి

– మేనూర్ గ్రామ సర్పంచ్ విట్టల్ గురూజీ అధ్యక్షతన పాలకవర్గం సభ్యులు పశువులదారులు గ్రామ పెద్దలు ప్రత్యేకంగా సమావేశం

– డిప్టేషన్ రద్దుచేసి యధావిధిగా మేనూర్ విధులు అప్పగించాలి
నవతెలంగాణ- మద్నూర్
మేనూర్ పశు వైద్య డాక్టర్ గా విధులు నిర్వహించే బండి వార్ విజయ్ ని ఆకస్మికంగా డిప్యూటేషన్ పేరుతో ఇక్కడి నుండి బీర్కూరు మండలంలోని రైతు నగర్ గ్రామానికి బదిలీ చేయడం మేనూరు గ్రామస్తులు పశు వైద్యశాల పరిధిలోని వివిధ గ్రామాల పశువుల దారులు డాక్టర్ బదిలీపై మంగళవారం నాడు మేనూర్ గ్రామ సర్పంచ్ విట్టల్ గురుజి అధ్యక్షతన ఆ గ్రామ పంచాయతీ పాలకవర్గం సభ్యులు ఆ గ్రామ పెద్దలు చుట్టుపక్కల గ్రామాల పశువుల దారులు ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఇక్కడ విధులు నిర్వహించే పశు వైద్య డాక్టర్ విజయ్ ని ఆకస్మికంగా బదిలీ చేయడం సరైంది కాదని బదిలీ చేసిన డాక్టర్ను వెంటనే మేనూర్ డాక్టర్ గా నియమించాలని లేనియెడల చుట్టుపక్కల గ్రామాల పశువుల దారులతో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని తీర్మానించినట్లు తెలిసింది పశువైద్య డాక్టర్ ఎంతో మంచి వ్యక్తిని అలాంటి వ్యక్తిని ఇక్కడి నుండి డిప్టేషన్ పేరుతో బదిలీ చేయడం సరైనది కాదని బదిలీ చేసిన డాక్టర్ బండి వార్ విజయ్ ని వెంటనే డిప్టేషన్ రద్దుచేసి మేనూర్ డాక్టర్ గా నియమించాలని డిమాండ్ చేశారు. డాక్టర్ బదిలీ రద్దు కాకపోతే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని వారి సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరించారు ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ మోహన్ గ్రామపంచాయతీ పాలకవర్గం సభ్యులు గ్రామ పెద్దలు పశువులదారులు పాల్గొన్నారు.
Spread the love