పరిసరాలు శుభంగా ఉంచుకోవాలి

– వైద్యుడు కారం నిఖిల్‌
నవతెలంగాణ-మంగపేట
ప్రజలు పరిసరాల శభ్రతపై దృష్టి సారించి సీజనల్‌ వ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని బ్రాహ్మణపల్లి ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం వైద్యుడు కారం నిఖిల్‌ అన్నారు. మంగళవారం అకినేపల్లి మల్లారం గ్రామంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహిం చారు. గ్రామంలో పెరుగుతున్న జ్వరాల దృష్ట్యా ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. వైరల్‌ ఫీవర్‌ కేసుల నమోదు అవుతున్న తరుణంలో ప్రతిరోజు గ్రామాల్లో ఆశ కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు సందర్శించినప్పుడు పరీక్షలు చేసి తీవ్రతను బట్టి స్థానిక ఆసుపత్రికి వచ్చి వైద్యం పొందాలన్నారు. పరిసరాల పరిశుభ్రత గురించి చర్యలు తీసుకోవాలని ప్రజలకు అవగాహన కల్పించారు. ఇంటింటా దోమలు పుట్టకుండా కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, స్ప్రేయింగ్‌ కార్యక్రమాలు నిర్వహించారు. హెల్త్‌ ఎడ్యుకేటర్‌ జయశ్రీ, సబ్‌ యూనిట్‌ ఆఫీసర్‌ నరసింహరావు, హెల్త్‌ అసిస్టెంట్‌ మెయిల్‌, ఎల్టీ పోదెం రవి, ఏఎన్‌ఎం సోమలక్ష్మి, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.

Spread the love